You are here
Home > Latest News > ప్రజలకు విజ్ఞత ఉంది ఐలయ్య గారూ!!

ప్రజలకు విజ్ఞత ఉంది ఐలయ్య గారూ!!

Spread the love

 

గద్దర్, విమలక్కకు రాజకీయాలతో ఏం పని?

ప్రజా సంఘాల నేతలు ఉంటూ రాజకీయాలా?

వాళ్లే అధికారం కోసం ఎగబడితే పోరాటాలు చేసేదెవరు?

ప్రజా యుద్ధ నౌక గద్దర్ అంటే ఎలా ఉంది? ముఖ్యమంత్రి గద్దర్ అంటే ఎలా ఉంది?

అరుణోదయ సాంస్కృతిక సంస్థ విమలక్క అంటే ఎలా ఉంది? మంత్రి విమలక్క అంటే ఎలా ఉంది?

రెండు సందర్భాలు కూడా జనానికి కాస్త విచిత్రంగా అనిపించేవే. కానీఎవరు ఏమనుకున్నా తాము మాత్రం చేసేది చేసి చూపిస్తామని కంచ ఐలయ్య చెబుతున్నారు. ఒక ప్రొఫెసర్ గా ఉంటూ కుల, మతాల మధ్య చిచ్చులు పెట్టిన మహనీయుడు ఈయన. ఇలాంటి వ్యక్తిగద్దర్, విమలక్క రాజకీయాల్లోకి వస్తారని, కేసీఆర్, కేటీఆర్ పై పోటీ చేస్తారని చెబుతున్నారు. పోటీ చేస్తామంటే ఎవరూ వద్దనరు కానీ విషయాన్ని గద్దర్, విమలక్కలే ఎందుకు చెప్పడం లేదు?

ఒకప్పుడు పెద్ద సభ పెట్టి.. ధూం ధాం పాటలు పాడి మరీ.. రాజకీయాల్లోకి వస్తానని, బహుజనులకు రాజ్యాధికారం కోసం ఓటుపై జనాల్లో చైతన్యం తెస్తానని గద్దర్ ఆర్భాటంగా ప్రకటించారు. కానీ తర్వాత ఏం చేశారు? సైలెంట్ గా తన కార్యక్రమాలు తాను చూసుకుంటున్నారు. విమలక్క కూడాఎప్పుడో ఒకపుడు ఏదో విషయం మీద విమర్శో, వ్యాఖ్యో చేసి ఊరుకుంటున్నారు. అలాంటి వారుముఖ్యమంత్రిపై, మంత్రి కేటీఆర్ పై పోటీ చేస్తే వచ్చే ఫలితం ఏమీ ఉండదు.

చేస్తామని చెప్పినవే కాదు. చెప్పనివి కూడా చేసి చూపించిన కేసీఆర్ పాలనపై జనాల ప్రేమను తగ్గించేందుకే ఇలాంటి చర్యలకు కొందరు పాల్పడుతున్నట్టు స్పష్టమవుతోంది. అందుకేగద్దర్, విమలక్కను పోటీలో నిలబెడతాం అని చెబుతున్నట్టే ఉంది. కానీజనాలు విజ్ఞులు. పరిపాలన అంటే ఏంటి? ప్రజా పోరాటం అంటే ఏంటో తెలిసిన వాళ్లు. ఎవరికి బాధ్యత అప్పగించాలో వారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు.

అందుకేకంచ ఐలయ్య గారూపగటి కలలు మానండి. వాస్తవాలు అర్థం చేసుకోండి.

Top