You are here
Home > Latest News > ప్రజలను తీర్పు అడిగే దమ్ము లేకనే… ఇలా కేసులు వేస్తున్నావు డీకే అరుణ..

ప్రజలను తీర్పు అడిగే దమ్ము లేకనే… ఇలా కేసులు వేస్తున్నావు డీకే అరుణ..

Spread the love

 

  • కోర్టుల చుట్టూ తిరిగితే ఏమొస్తది చెప్పు..
  • మీరు ఎప్పుడో ఓడిపోయారు..
  • మీరా తెలంగాణను ఉద్ధరించేది…

డీకే అరుణ సూటిగా ఓ సమాధానం చెప్పమ్మా.. కాంగ్రెస్ హయాంలో నీ జిల్లా ఎంత మేరకు అభివృద్ధి అయింది. పోనీ.. నువ్వు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న కాలంలో నీ నియోజకవర్గాన్ని, నీ జిల్లాను ఎప్పుడన్నా పట్టించుకున్న పాపాన పోయినవా? లేదు.. పాలమూరును వలసల జిల్లాలుగా మార్చిందే మీరు.. కాంగ్రెస్ పార్టీ. ఎకరాలకు ఎకరాలను వదిలేసుకొని మరీ వలసలు పోయి కూలినాలి చేసుకొని బతికారు పాలమూరు వాసులు. వాళ్లు ఏం పాపం చేశారు. వాళ్లు అడిగింది గుక్కెడు సాగు నీరు, సాగు కోసం కరెంట్. అది కూడా ఇవ్వలేకపోయింది  మీ ప్రభుత్వం. సిగ్గు చేటు మీకు ఇది. అన్నదాతను ఎనాడైనా పట్టించుకున్నారా మీరు. ఒకసారి రికార్డులు తిరిగేస్తే తెలుస్తుంది కదా. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ హయాంలో ఎంతమంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారో తెలియదా నీకు. వాళ్ల పాపం ఊరికే పోదు. అది మీకు తగలక మానదు.

సర్వనాశనం చేశారు. దశాబ్దాల పాటు పాలించి ఇటు తెలంగాణను నాశనం చేశారు. అటు దేశాన్ని భ్రష్టు పట్టించారు. ఏదమ్మా.. మీరు చేసిన అభివృద్ధి. చూపించండి. ప్రజల ముందుకు వచ్చి.. ఇది మీం చేసిన అభివృద్ధి అని చూపించండి. అరె.. ప్రతి పనిలో అడ్డుకుంటారు. పుల్లలు పెడతారు.. కోర్టుల్లో కేసులు వేస్తారు. ఇంకేదో చేస్తారు. అసలు ఏమనుకుంటున్నారు మీరు… తెలంగాణ అభివృద్ధి చెందాలా వద్దా… తెలంగాణ ఎప్పుడూ ఎండిపోయినట్టే ఉండాలా? అభివృద్ధి చేయకూడదా? ఇదేం రాజకీయమో అర్థం అయితలేదు.

మీలాంటి దుష్టశక్తుల నుంచి తెలంగాణను కాపాడటానికే సీఎం కేసీఆర్ ప్రజా తీర్పు కోరుతున్నారు. మీకు దమ్ముంటే ప్రజా కోర్టులో కొట్లాడండి. గెలిచి చూపించండి. ప్రజా కోర్టులో తేల్చుకుందామంటే… కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మీరు. అంటే మీరు మీ ఓటమిని ఒప్పుకున్నట్టే కదా అరుణ. ప్రజా తీర్పు కోసం, ప్రతిపక్షాల ఆటలు కట్టించడానికి సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. మరి.. మీరు దాన్ని కూడా రాద్ధాంతం చేయడం దేనికి. మీకు నిజంగా దమ్ముంటే… ప్రాజెక్టులను అడ్డుకోవడం కాదు.. తెలంగాణలో గెలిచి చూపించండి. అది చేతగాక ఎందుకు ప్రతిదాంట్లో అడ్డుపుల్లేస్తున్నారు అరుణ. తెలంగాణను అభివృద్ధి చేయకూడదా? మీ హయాంలో ఎలాగూ తెలంగాణను దోచుకుతిన్నారు. ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు అడ్డు తలుగుతున్నారు. మీరు ఇంకెప్పుడు మారుతరు అరుణ. మీరు తెలంగాణలో చెడ పుట్టారు. మీలాంటి తెలంగాణ ద్రోహులకు తెలంగాణలో చోటు లేదు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతి ఒక్కరి గతి ఏంటో కొద్ది రోజుల్లోనే తేలనుంది. ప్రజా కోర్టులో తేల్చుకో చేతగాక కోర్టుల చుట్టూ తిరుగుతూ తెలంగాణ అభివృద్ధి అడ్డంకులుగా మారిన మిమ్మల్ని తెలంగాణ నుంచి తరిమేయడమే అరుణ. అప్పుడన్నా తెలంగాణ ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే.. మీరు తెలంగాణను అభివృద్ధి చేయనీయరు.

Top