You are here
Home > News > ప్రజలు అవకాశం ఇస్తే కదా… కాంగ్రెస్ కలలు నిజమయ్యేది!!

ప్రజలు అవకాశం ఇస్తే కదా… కాంగ్రెస్ కలలు నిజమయ్యేది!!

Spread the love

 

  • – అధికారంపై రోజుకో తీరుగా కాంగ్రెస్ నేతల కలలు
  • – తొలి సంతకం డీఎస్సీపైనే అంటూ మోసపూరిత వ్యాఖ్యలు
  • – సంఘాలనునేతలను తప్పుదోవ పట్టిస్తున్న నేతలు

జనం అసహ్యించుకుంటున్నా కూడా… కాంగ్రెస్ నేతల అధికార యావను మాత్రం చంపుకోలేకపోతున్నారుమేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసిన దగ్గర్నుంచి ఆ పార్టీ నేతలు… ముఖ్యంగా కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ వ్యాఖ్యలు గమనిస్తున్న వాళ్లంతా ఇది నిజమే అని కూడా ఒప్పుకొంటున్నారునిన్నటికి నిన్న.. కాంగ్రెస్ ఆఫీసులో వందకు పైగా సంఘాల నాయకులతో భేటీ అయిన తర్వాత దామోదర మాట్లాడిన తీరును కూడా తప్పుబడుతున్నారు.

అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్న కేసీఆర్ పరిపాలనను విమర్శించడం ఓ తప్పయితే… కుల సంఘాల నేతలను తమ దగ్గరికి రప్పించుకోవడం మరో తప్పునిజంగా తమకు మంచి చేయాలన్న ఆలోచనే కాంగ్రెస్ నేతలకు ఉంటే… వాళ్లే వెళ్లి సంఘాల నాయకులతో సమావేశమవ్వాలిఆయా వర్గాలకు ఏం చేయబోతున్నారు… ఏం అవసరాలు ఉన్నాయి… అన్నది వ్యక్తిగతంగా తెలుసుకోవాలిఅభివృద్ధిపై భరోసా ఇవ్వాలి.

కానీ… తామేదో మహారాజులమన్నట్టు పోజులు కొడుతూ తమ దగ్గరికే సంఘాల నేతలను రప్పించుకున్న తీరు ఏ మాత్రం బాగోలేదుప్రతిపక్షంగా ఉన్నప్పుడే ఇలాంటి వైఖరి ప్రదర్శిస్తే ఇక అధికారంలోకి వస్తే ఇంకెంత అధికార దర్పం,దుర్వినియోగాన్ని చూపిస్తారో అన్న చర్చ కూడా అప్పుడే మొదలైందికాంగ్రెస్ నేతలు ఎన్ని హామీలు ఇచ్చినా… ఎంతగా సంక్షేమం చేస్తామని చెప్పినా… ఇలాంటి వైఖరి వీడనంత కాలం జనం నమ్మరు అన్న మాట సర్వత్రా వినిపిస్తోంది.

డీఎస్సీ గురించి మాట్లాడ్డం ఆపి… తాము అధికారంలో ఉన్నపుడు హైదరాబాద్ ను ఫ్రీ జోన్ చేస్తే ఎందుకు అడ్డుకోలేకపోయారో సమాధానం చెప్పాలికేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న నియామకాలపై కోర్టుల్లో కేసులు ఎందుకు వేశారో చెప్పాలికోటి ఎకరాల సాగు దిశగా సాగుతున్న ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకునే యత్నం చేశారో వివరించాలిఆ తర్వాతే… ఈ హామీలుమేనిఫెస్టో కమిటీలుసంఘాలతో సమావేశాల గురించి చెప్పుకోవాలిఇది మా మాట కాదుజనం మాటకాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూద్దాం.

Top