You are here
Home > Latest News > ప్రజలు ఇబ్బందులకు గురైనా పర్వాలేదా నారాయణ?

ప్రజలు ఇబ్బందులకు గురైనా పర్వాలేదా నారాయణ?

Spread the love
  • ప్రజలు ఇబ్బందులకు గురైనా పర్వాలేదా నారాయణ?
  • అసలు.. సీపీఐ అనే పార్టీ ఇంకా ఉందా?
  • ఉంటే.. సీపీఐ తెలంగాణ కోసం ఏం చేసిందో కాస్త చెబుతావా నారాయణ
  • ఊరికే మైకుల ముందు వాగడం వల్ల మీకు వచ్చేదేం ఉండదు నారాయణ

సీపీఐ నారాయణ.. ఈయన ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడుతున్నాడు. నారాయణ.. ఇన్ని రోజులు ఎక్కడిక పోతివి. ఇప్పుడు నీకు ఆర్టీసీ కార్మికుల మీద ఒకేసారి ప్రేమ కురుస్తున్నట్టుంది. సెల్ఫ్ పొలిటికల్ సూసైడ్ ను మీ పార్టీ ఎప్పుడో చేసుకున్నది కదా. నారాయణ.. అవన్నీ కాదు కానీ నువ్వు కానీ.. నీ పార్టీ కానీ తెలంగాణ కోసం ఏం చేసిందో చెప్పు. చెప్పడానికి ఒక మాట కూడా ఉండదు. ఎందుకంటే.. మీరు తెలంగాణ కోసం ఏం చేయలేదు కాబట్టి. ఇంకో విషయం. గత ప్రభుత్వాల పాలన సమయంలో ఆర్టీసీ కార్మికులు ఇంత కన్నా ఎక్కువ నరకాన్ని అనుభవించారు. చాలీచాలని జీతాలతో దుర్భర జీవితాన్ని అనుభవించారు. అప్పుడు నీకు ఆర్టీసీ కార్మికులు గుర్తుకురాలేదా? అప్పుడెందుకు అప్పటి ప్రభుత్వాలను నువ్వు నిలదీయలేదు. ఎందుకు నారాయణ కేవలం తెలంగాణ ప్రభుత్వం మీదే పడ్డావు. తెలంగాణ ప్రభుత్వం ఆదుకున్నంతగా ఆర్టీసీ కార్మికులను ఏ ప్రభుత్వమూ ఆదుకోలేదు. అది జగమెరిగిన సత్యం. ఒకవేళ నిజంగానే గత ప్రభుత్వాలు ఆర్టీసీ కార్మికులను ఆదుకొని ఉంటే ఇప్పుడు వాళ్లకు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు నారాయణ.

కానీ.. ఒక జాతీయ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడిగా నీ గుండె మీద చేయి వేసుకొని చెప్పు.. నువ్వు తెలంగాణ కోసం ఏం చేశావో? ఆర్టీసీ కార్మికుల కోసం ఏం చేశావో? ఏం లేదు… ఆర్టీసీ కార్మికులను ఆదుకున్న తెలంగాణ ప్రభుత్వంపై రాళ్లు వేయమంటే మాత్రం రెడీ అయిపోతావు. సెల్ఫ్ పొలిటికల్ సూసైడ్ ఏ పార్టీ చేసుకున్నదో.. ఎవరు చేసుకున్నరో కూడా తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు నారాయణ. ఇన్న రోజులు నీకు ఆర్టీసీ కార్మికులు గుర్తుకు రాలేదు కానీ.. ఒక్కసారిగా వాళ్లు చట్ట విరుద్ధమైన సమ్మె చేయగానే గుర్తుకొచ్చారా? ఇన్ని రోజులు మాట్లాడని నువ్వు ఇప్పుడు మైకుల ముందు తెగ మాట్లాడేస్తున్నావు కదా. మేము కూడా ఉన్నాం తెలంగాణలో మా మాట కూడా కాస్త వినండి.. అన్నట్టుగా ఉన్నాయి నీ వ్యాఖ్యలు. ఆర్టీసీ కార్మికులకు మేం కూడా అండగా ఉంటాం… అంటూ కపట ప్రేమ నటిస్తున్నారు.

ఈ సోయి ముందే ఉండాలి కదా. దశాబ్దాల పాటు తెలంగాణను పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆర్టీసీ కార్మికులను ఆదుకోలేకపోయింది. ఒకవేళ ఆర్టీసీ కార్మికులపై కాంగ్రెస్ కు నిజంగా ప్రేమ ఉండి ఉంటే.. ఎందుకు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయలేదు. ఎందుకు వాళ్లకు జీతాలు పెంచలేదు. ఇదంతా ఉత్త ముచ్చట. ప్రతిపక్షాలన్నీ కలిసి ఆర్టీసీ కార్మికులను ఆదుకున్న తెలంగాణ ప్రభుత్వం మీదనే దుమ్మెత్తిపోస్తున్నారు. దీని వల్ల మీకేదో ఒరుగుతుందని మీరు అనుకుంటే మీకన్నా పిచ్చోళ్లు ఇంకెవరూ ఉండరు.

Top