You are here
Home > Latest News > ప్రజల పక్షాన ఏం పోరాడావు సంపత్?

ప్రజల పక్షాన ఏం పోరాడావు సంపత్?

Spread the love

ప్రజల పక్షాన పోరాడినందుకు ఇంతటి శిక్ష పడుతుందని తాను నమ్మలేకపోయానని అంటున్నాడు.. ఎమ్మెల్యే సంపత్. ఆయన ఏం పోరాడాడు? ఏమని కష్టపడ్డాడు? మంచి చేస్తాడని నమ్మి.. ఓట్లేసి గెలిపించిన జనాన్ని నట్టేట ముంచుతూ.. వారి పరువును అడ్డంగా తీసిపారేస్తూ.. అసెంబ్లీలో రౌడీ లా గూండాగా ప్రవర్తించడమే.. సంపత్ చేసిన పోరాటమా?

సభలో గవర్నర్ ప్రసంగిస్తుంటే.. గౌరవ ప్రదంగా అడ్డుకోవాల్సింది పోయి.. నానా హింస సృష్టించి.. మండలి చైర్మన్ ను హత్య చేసినంత పని చేశారే.. అదేనా సంపత్ చేసిన పోరాటం? అసలు ఏం చేశాడని ఆయన పోరాటం చేశానని చెప్పుకుంటున్నాడు? సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడేందుకు. ఎందుకింత దిగజారుతున్నారో.. ఎందుకింత తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియాలి.

అధికారం కోసం మరీ ఇంతలా అర్రులు చాచడమే కాదు. అన్యాయపు రాజకీయాలు చేస్తే ప్రజలు హర్షించరన్న వాస్తవాన్ని కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలి. అలా కాదంటే.. వారి సంగతి తేల్చేందుకు ప్రజలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. పదేళ్ల పాటు తెలంగాణ ఏర్పాటును నాన్చీ నాన్చీ వందల మంది ఆత్మ బలిదానానికి కారణమయ్యారు. ఇప్పుడు.. మళ్లీ ప్రతిపక్షంలో అలాంటి కుట్రలే చేస్తున్నారు.

అందుకే.. కాంగ్రెస్ నేతలు.. ముఖ్యంగా సంపత్, కోమటిరెడ్డి తీరును జనం మాత్రం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. రాబోయే రోజుల్లో.. తామే శిక్షిస్తామని బహిరంగ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Top