You are here
Home > Latest News > ప్రజా కోర్టులో అన్ని విషయాలపై చర్చకు సిద్ధమే!

ప్రజా కోర్టులో అన్ని విషయాలపై చర్చకు సిద్ధమే!

Spread the love

ఒక్క గ్రామ సభలో ఎందుకు భట్టీ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా కోర్టు ఉంది కదా. అందులో చర్చించుకుందాం. కాంగ్రెస్ పార్టీనో.. జనరంజక కేసీఆర్ పరిపాలనో తేలిపోతుంది. ఇచ్చిన హామీల్లో వందకు వందశాతం అమలు చేస్తుండడమే కాదు.. ఇవ్వని హామీలను కూడా అద్భుత రీతిలో అమలు చేస్తూ.. దేశాన్ని ఆకర్షించగలుగుతున్న కేసీఆర్ పరిపాలనపైనా మీ పిచ్చి ప్రేలాపనలు? ఎంతో కాలం లేదు. ఇంకో పదంటే పది నెలలే.

ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మీ బలం.. బలగం చూసుకుని.. పూర్తిగా కాంగ్రెస్ నేతలనే పెట్టి.. అందులో జనం లేకుండా చూసి.. అబద్ధాలు ప్రచారం చేసి.. గ్రామ సభలతో ప్రభుత్వం పరువు తీయాలని మీరు కుట్రలు చేస్తే.. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ మాత్రం అడ్డుకోరు. ఎందుకంటే.. అది మీకు మీరుగా చేసుకున్న ఆత్మహత్యాసదృశం అవుతుంది కాబట్టి. జనాలే మీ అంతు చూస్తారు.

ధైర్యముంటే.. ప్రభుత్వ కార్యక్రమాలపై మీరూ చర్చకు సిద్ధం కండి. జానారెడ్డి వచ్చినా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చినా సరే. ఎవరొచ్చినా సరే. మిమ్మల్ని ఎదుర్కొనేందుకు చిన్నస్థాయి టీఆర్ఎస్ కార్యకర్త కూడా చాలు. అంతే కానీ.. జనం సేవలో నిత్యం తీరిక లేకుండా ఉన్న ముఖ్యమంత్రినో, మంత్రి కేటీఆర్ నో రావాలి.. రావాలి అని మీకు ఆత్రంగా ఉంటే.. ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. వారికి చాలా పనులున్నాయి. కావాలంటే కొన్నాళ్లు ఆగండి. ఎన్నికల సమయంలో మీ తాట తీసేందుకు నేరుగా ప్రజా క్షేత్రంలోకి వస్తారు. అప్పుడు మీ ఆవేదన ఎవరికి చెప్పుకుంటారో చూద్దాం.

Top