You are here
Home > Latest News > ప్రతిప‌క్షాల చేతుల్లో కీలుబోమ్మ‌ హ‌ర‌గోపాల్‌..

ప్రతిప‌క్షాల చేతుల్లో కీలుబోమ్మ‌ హ‌ర‌గోపాల్‌..

Spread the love
  • ప్రతిప‌క్షాల చేతుల్లో కీలుబోమ్మ‌లుగా మేధావులు
  • గురుకులాల‌ను త‌ప్పుప‌డుతున్న హ‌ర‌గోపాల్‌
  • అభివృద్ధిని ఓర్వ‌లేక‌పోతున్న కుహాన వాదులు
  • కేసీఆర్‌పై బుర‌దజ‌ల్లేందుకు య‌త్నాలు

ప్ర‌తిప‌క్షాల చేతుల్లో కీలుబొమ్మ‌లుగా మారిన తెలంగాణ మేధావులు అర్ధం ప‌ర్థం లేని మాట‌లు మాట్లాడుతున్నారు. తాజాగా ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్ గురుకులాల‌ను త‌ప్పుబడుతున్నారు. పేద‌ల ముంగిట్లోకి చ‌దువును చేర్చాల‌ను మ‌హోన్న‌త ఆశయంతో సీఎం కేసీఆర్ నెల‌కొల్పిన గురుకులాల‌ను కేవ‌లం కులం ప్ర‌తిపాదిక‌న ఏర్పాటుచేశార‌ని త‌మ కుళ్లు బుద్ధిని బ‌య‌ట‌పెట్టుకుంటున్నారు. ఎంద‌రో మంది పేద విద్యార్థులు చ‌దువు కొన‌లేక దూర‌మైన ప‌రిస్థితుల్లో గురుకులాల ద్వారా రెసిడెన్షియ‌ల్ త‌ర‌హాలో వారికి విద్య‌ను అందిస్తున్నారు. స‌మైక్య పాల‌నలో వెనుక‌బ‌డిని విద్యారంగాన్ని తీర్చిదిద్దేందుకు ఎంతో ఉన్న‌త ఆశ‌యంతో ఈ ప‌థ‌కాన్ని తీసుకొస్తే దీనిపై విమ‌ర్శ‌లు చేయ‌డానికి మీకు సిగ్గులేదా అని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. అసలు ప్ర‌తిప‌క్షాల చేతుల్లో కీలుబొమ్మ‌లుగా మారిని మిమ్మ‌ల‌ను జ‌నం న‌మ్మేందుకు సిద్ధంగా లేర‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఈక్ర‌మంలో ఇప్పటికైనా వాస్త‌వాలు గ్ర‌హించి మాట్లాడాల‌ని జ‌నం సూచిస్తున్నారు. ఇక మ‌హాకూట‌మికి అనుకూలంగా మాట్లాడుతున్న త‌రిమికొడుతామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. అస‌లు కేసీఆర్ వ‌చ్చాకే రాష్ట్రంలో విద్యారంగం గాడిన ప‌డింద‌ని కేంద్ర‌నివేదిక‌లు స్ప‌ష్టం చేసిన క్ర‌మంలో ఇలా మాట్లాడ‌డం త‌గ‌దని హ‌ర‌గోపాల్‌లాంటి మేధావులకు హిత‌వు పలుకుతున్నారు.

మ‌రోవైపు తెలంగాణాలోని మేథావులు ప్ర‌తిప‌క్షాల చేతుల్లో ఆట‌బొమ్మ‌ల్లాగా మారారు. వారు చెప్పిన‌ట్ట‌ల్లా ఆడుతున్నారు. గ‌త నాలుగున్న‌రే్‌ళ్ల‌లో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి మీకు క‌న్పించ‌డం లేదా. ఊరికే టీఆరెస్‌ను విమ‌ర్శించ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటున్నారు. ఒక‌వైపు తెలంగాణాలో అభివృధ్దికి ఆంద్రోళ్లు సైతం ఫిదా అవుతుంటే వీరికి మాత్రం అభివృద్ధి క‌న్పించ‌డం లేదు. శుష్క మీటింగ్‌ల‌తో జ‌నాల‌ను ప్రభావితం చేయాల‌ని  కంక‌ణం క‌ట్టుకున్నారు. ఫీల్డ్‌లో ప‌రిస్థితి తెలియ‌కుండా తామే మేథావుల‌మ‌నే భ్ర‌మ‌లో బ‌తుకుతున్నారు. వీరు మాట్లాడే మాట‌ల‌ను  చూసి జ‌నం లోలోప‌ల జాలి ప‌డుతున్నారు. ముఖ్యంగా హ‌ర‌గోపాల్‌లాంటి మేథావి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డంపై మండిప‌డుతున్నారు. సంక్షేమంతోపాటు అభివృద్ధిని మిళితం చేస్తున్న కేసీఆర్ పాల‌న ప‌టిమ మీకు కన్పించ‌డం లేదా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఏ పార‌మీట‌ర్‌లో చూసిన తెలంగాణ దేశంలోకెల్లా వేగంగా అభివృద్ధి సాధిస్తున్న రాష్ట‌రంగా నిలిచిందన‌డంలో ఎలాంటి సందేహంలేదు. ఈ ఏడాది 21 శాతం అభివృద్ధితో తెలంగాణ దూసుకుపోతున్న వైనం మీకు కన్పించ‌డం లేదా అని జ‌నాలు సూటిగా అడుగుతున్నారు. ఇప్ప‌టికైనా బుద్ధి తెచ్చుకుని జ‌నాలకు వాస్త‌వాలు వివ‌రించాల‌ని హిత‌వుప‌లుకుతున్నారు.

Top