You are here
Home > Latest News > ప్రధానిని కలిసినా తప్పే.. కలవకున్నా తప్పేనా?

ప్రధానిని కలిసినా తప్పే.. కలవకున్నా తప్పేనా?

Spread the love

 

  • ఎడ్డమంటే తెడ్డమంటారు.. తెడ్డమంటే ఎడ్డమంటారు..
  • తెలంగాణ బాగుపడితే చూడలేరు మీరు సన్నాసుల్లారా?

కేంద్రం విభజన హామీలను అమలు చేయట్లేదని… రాష్ట్ర ప్రభుత్వం విభజన హామీలపై నిలదీయాలి అంటారు ఈ కాంగ్రెస్ నేతలు. కాని వీళ్లు మాత్రం కేంద్రాన్ని నిలదీయరు. కేవలం మైకుల ముందు మాట్లాడే బ్యాచ్ వీళ్లది. తెలంగాణ ప్రజల కోసం, అభివృద్ధి కోసమే కదా.. అని సీఎం కేసీఆర్ తెలంగాణకు ఇచ్చిన హామీలపై ప్రధాని మోదీని కలిస్తే దానికి కూడా రాజకీయ రంగు పులుముతున్నారు.

ఇక.. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇన్ని రోజులు తెలంగాణ సంక్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు ఏకంగా మైకుల ముందు పిచ్చికూతలు కూస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే.. ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా. ఇప్పుడు అధికార పార్టీపై బురద జల్లాలి కదా. అందుకే తెలంగాణ గురించి ఏం తెలియని వాళ్లు కూడా తెలంగాణ సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. అందులో టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఒకరు. ఈయన ఎవరో కూడా చాలా మందికి తెలియదు. ఈయన తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ సంక్షేమం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు.

దశాబ్దాలుగా తెలంగాణను పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడూ తెలంగాణ సంక్షేమాన్ని పట్టించుకోలేదు. కేంద్రంలో అధికారంలో ఉండి, తెలంగాణలో అధికారంలో ఉన్నా తెలంగాణను మాత్రం అభివృద్ధి చేయలేక తన చేతగాని తనాన్ని చూపించుకుంది. కాంగ్రెస్ పార్టీ చేయలేని అభివృద్ధిని ఇప్పుడు సీఎం కేసీఆర్ చేసి చూపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతున్నది. ఎలాగైనా సీఎం కేసీఆర్ పై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నది. దానిలో భాగంగానే మైకుల ముందు కాంగ్రెస్ నాయకులు పిచ్చి కూతలు కూస్తున్నారు. ప్రధాని, సీఎం కేసీఆర్ భేటీని కూడా రాజకీయం చేస్తున్నారు.

Top