You are here
Home > Latest News > ప్రాజెక్టు కడతామంటే అడ్డుకుంటారు.

ప్రాజెక్టు కడతామంటే అడ్డుకుంటారు.

Spread the love

ప్రాజెక్టు కడతామంటే అడ్డుకుంటారు. ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే.. దాన్ని కూడా తప్పుబడుతుంటారు. అడుగడుగునా సంక్షేమానికి అడ్డం పడుతుంటారు. అలాంటి మీరు.. ఇప్పుడు కాళేశ్వరం పనుల్లో జాప్యం జరుగుతోందనడం.. హాస్యాస్పదం. జీవన్ రెడ్డీ.. రోజురోజుకూ నువ్వు స్థాయిని దిగజార్చుకుంటున్నావు. ఇదేమన్నా న్యాయంగా ఉందా? నిన్ను నమ్ముకుని గెలిపించిన ఓటర్లకు ఇదేనా నువ్వు చేసే న్యాయం?

జీవన్ రెడ్డీ.. ఇన్నాళ్లూ జరిగిన చరిత్రను మరిచిపోయావా లేక.. మరిచిపోయినట్టు నటిస్తున్నావా? వరుగా ప్రాజెక్టులు కడుతున్న సర్కార్.. ఇరిగేషన్ రంగాన్ని పరుగులు పెట్టిస్తుంటే.. ఇచ్చిన మాట ప్రకారం.. తక్కువ నష్టం.. ఎక్కువ లాభంతో ప్రాజెక్టును రీ డిజైన్ చేసి.. రైతన్నల కోసం అందుబాటులోకి తెచ్చేందుకు పనిచేస్తుంటే.. అడ్డుకుంటున్నది మీరు కాదా? కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ.. నిర్మాణాలు అడ్డుకుంటూ.. పనులు ఆలస్యమయ్యేందుకు కారణమవుతూ.. ఇప్పుడు ఇలా మాట్లాడ్డానికి మీకు నోరెలా వస్తోంది?

మీరు ఇంత చేస్తున్నా.. ప్రభుత్వం ఎక్కడా అడుగు వెనక్కు వేయడం లేదు. అనుకున్న సమయంలోపే ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు.. కంకణం కట్టుకున్న ప్రభుత్వం.. నిధుల విడుదలలోనూ అదే చిత్తశుద్ధిని ప్రదర్శిస్తోంది. ఒక్క ప్రాజెక్టుకూ జాతీయ హోదా సాధించలేని మీరు దద్దమ్మలు.. ఇప్పుడు ప్రభుత్వాన్ని తిడతారా? సిగ్గుండాలి. చెప్పేది మంచి మాటలు.. చేసేది గలీజు పనులు అన్నట్టు తయారైంది కాంగ్రెస్ వాళ్ల పరిస్థితి. అందుకే.. ప్రజలు కాంగ్రెస్ ను ఛీ కొడుతున్నారు.

ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి.. హామీలు నెరవేర్చడమే కాదు. నీటి పారుదల రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా.. ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ఫలితాలు.. త్వరలోనే రాష్ట్రాన్ని మరింత సుసంపన్నం చేసే దిశగా కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో.. మంచిని ప్రచారం చేయాల్సిందిపోయి.. చెడును భుజాన మీద వేసుకున్న కాంగ్రెస్ నేతలు.. తప్పు మీద తప్పు చేస్తున్నారు.

అందుకే ఓ మాట స్పష్టం చేస్తున్నాం. కాళేశ్వరం పనుల్లో.. ప్రభుత్వం పరంగా ఎక్కడా జాప్యం జరగడం లేదు. ప్రాసెస్ పూర్తి కాగానే.. ప్రాజెక్టును మరింతగా పరుగులు పెట్టించేందుకు కేసీఆర్ సర్కారు.. శతథా సహస్రథా సిద్ధంగా ఉంది.

Top