You are here
Home > Latest News > ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఎప్ప‌టికీ కొన‌సాగుతాయిరా వెర్రి గొర్రె

ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఎప్ప‌టికీ కొన‌సాగుతాయిరా వెర్రి గొర్రె

Spread the love
  • ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఎప్ప‌టికీ కొన‌సాగుతాయిరా వెర్రి గొర్రె
  • వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు, ఎన్నిక‌ల కోడ్ వ‌ల్లే పంపిణీలో కాస్త జాప్యం
  • కొన‌సాగుతున్న రెండో విడుత గొర్రెల పంపిణీ
  • తెలంగాణ‌లో ఏ ప్ర‌భుత్వ ప‌థ‌క‌మూ నిలిచిపోలేదు
  • ఆంధ్రా బుద్ధులు మానుకోని ఆంధ్రా జ్యోతి
చేసిన త‌ప్పుల‌కు ప్ర‌జ‌లు కొట్టిన దెబ్బ‌తో చంద్ర‌బాబు దిమ్మ‌తిరిగిపోయినా… ఆయ‌న ప‌చ్చ మీడియా, పిచ్చి రాత‌లు రాసే ఆంధ్ర‌జ్యోతి తీరుమాత్రం మార‌లేదు. ప్ర‌త్యేక రాష్ట్రం రాక‌ముందు నుండీ విషం కక్కుతూనే ఉన్న ఈ ఎల్లో మీడియా… తెలంగాణ వ‌చ్చాక కూడా అదే ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌వేశ పెడుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌కు దేశ‌వ్యాప్తంగా ఆద‌ర‌ణ ల‌భిస్తుంటే.. అందులోనూ రంధ్రాన్వేష‌ణ చేస్తోంది ఆంధ్ర‌జ్యోతి. రాష్ట్రంలోని గొల్ల‌, కుర్మ‌ల‌కు ఆర్థికంగా చేయూత‌నివ్వాల‌న్న ఉద్దేశంతో కేసీఆర్ గొర్రెల పంపిణీ ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు.
అందులో భాగంగా.. రాష్ట్రంలో 7.29 లక్షల మంది గొల్ల కుర్మలను లబ్ధిదారులుగా గుర్తించారు. 2017 జూన్‌ నుంచి గొర్రెల పంపిణీ ప్రారంభించారు. ఇప్పటి వరకు 3.65 లక్షల కుటుంబాల‌కు 20 గొర్రెలు, 1 పొట్టేలు చొప్పున 56.28 లక్షల గొర్రెలను పంపిణీ చేశారు. ఈ గొర్రెలకు సుమారు 26 లక్షల పిల్లలు పుట్టాయి. వీటి విలువ సుమారు రూ.1000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. నిరంతర ప్రక్రియగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
మొదటి విడతగా 3,65,520 యూనిట్లను పంపిణీ చేసింది. రెండో విడుత‌ను ఏప్రిల్‌, మేలోనే ప్రారంభించాల‌నుకున్నా.. ఎండ‌ల నేప‌థ్యంలో దాన్ని వాయిదా వేశారు. ఎండ‌ల తీవ్ర‌త దృష్ట్యా ప‌శుగ్రాసం కొర‌త ఏర్ప‌డొద్ద‌న్న ఉద్దేశంతోనే ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా ఎన్నిక‌లు రావ‌డం వ‌ల్ల కోడ్ కార‌ణంగా పంపిణీ చేయ‌లేక‌పోయారు. ప్ర‌స్తుతం కూడా వ‌రుస‌గా వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు అనుకూలించ‌గానే దాన్ని తిరిగి ప్రారంభించ‌నున్నారు.
Top