You are here
Home > Latest News > బండి సంజయ్… రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను అలాగే వదిలేద్దామా?

బండి సంజయ్… రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను అలాగే వదిలేద్దామా?

Spread the love
  • బండి సంజయ్… రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను అలాగే వదిలేద్దామా?
  • మీరు పార్టీ ఎలాగూ తెలంగాణను పట్టించుకోదు కదా
  • నువ్వు ఎంపీ అవ్వడం వల్ల తెలంగాణకు రూపాయి ఫైదా లేదు
  • రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో విషయాలు కొలిక్కి రావాల్సి ఉంది

వాటాల కోసమే కేసీఆర్, జగన్ తరుచూ భేటీ అవుతున్నారట. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు. అయ్యా.. బండి సంజయ్… ఎవరి గురించి ఎలా మాట్లాడాలో కూడా తెలియనితనంతో ఉన్నారు మీరు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయో నీకు తెలియదా? తెలిసి కూడా ఇలా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులపై ఇలాంటి నిందలు వేస్తావా? ఒక ఎంపీవై ఉండి… ఇలాంటి మాటలు మాట్లాడటానికి నీకు నోరెలా వచ్చింది. ఇదేనా బీజేపీ నేతలకు ఉన్న సంస్కారం.

తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. కేంద్రం ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించకున్నా… ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటుంటే మధ్యలో నీ బుడ్డ పెత్తనం ఏంది. నువ్వు ఎంపీ అవడం వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదు. ఆ విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలి ముందు.

నీవల్ల తెలంగాణకు రూపాయి ఫైదా లేదు. నువ్వు ఎంపీ అయితే ఎంత…. కాకుంటే ఎంత. తెలంగాణ నుంచి బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు ఉన్నారు. కానీ.. ఏం లాభం. ఒక్కరు కూడా ఆయిమన్నోళ్లు లేరు. అంతా కేంద్రం దగ్గర వణికేవాళ్లే. మొన్నటి బడ్జెట్ లో తెలంగాణకు రూపాయి కూడా కేటాయించలేదు కేంద్రం. అప్పుడు ఏం చేశారు మీరు. ఎక్కడ పోయారు మీరు. మీది తెలంగాణ కాదా? తెలంగాణలో పుట్టలేదా మీరు. తెలంగాణకు చెందిన ఎంపీలు అయి ఉండి కూడా తెలంగాణ కోసం ఏం తీసుకురాలేకపోయారంటే మిమ్మల్ని ఏమనాలి.

అందుకే… కేంద్రాన్నో.. ఇంకెవరినో నమ్ముకోకుండా.. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలు దృష్టి సారించారు. వాళ్లు తరుచూ కలిసి.. ఏదో చేస్తున్నారంటూ మీరు అసత్యపు ప్రచారాలు చేసినంత మాత్రాన నిజం అబద్ధం కాదు.. అబద్ధం నిజం కాదు. రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం స్నేహపూర్వక వాతావరణం ఉంది. దాన్ని మీరు చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నారని మీ మాటల్లోనే అర్థమవుతోంది. మీరు ఎన్ని గూడు పుఠాణీలు చేసినా అది మీకే నష్టం అనే విషయాన్ని గ్రహించండి బండి.

Top