You are here
Home > Latest News > బతుకమ్మ చీరలకు నిప్పుపెట్టి,తమ రాజకీయ భవిష్యత్తుకు చితి పేర్చుకున్న కాంగ్రెస్.

బతుకమ్మ చీరలకు నిప్పుపెట్టి,తమ రాజకీయ భవిష్యత్తుకు చితి పేర్చుకున్న కాంగ్రెస్.

Spread the love

కేసీఆర్ మీద ఉన్న కోపంతో చాలా నీచమైన పనికి ఒడిగట్టారు కాంగ్రెస్ నాయకులు.ఇష్యు యొక్క సేన్సిటివిటి ని అర్థం చేసుకోకుండా,మిగతా వాటి లాగే ఇక్కడా అదే రకమైన వ్యతిరేకతను ప్రదర్శించారు.దేనికైనా కొన్ని హద్దులు ఉంటాయి,అవి దాటి చేస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి.అది విధాన పరమైన నిర్ణయం కాదు,రాజకీయ నిర్ణయం అంతకన్నా కాదు.వాటిని డీల్ చేసినట్టు చాలా రఫ్ గా చాలా క్రూరంగా దీనినీ డీల్ చేసారు.ద్వేషం మనిషిలోని విచక్షణా జ్ఞానాన్ని పోగొడుతుంది.ఇక్కడ జరిగింది అదే.బ్రహ్మాస్త్రాన్నైతే  ప్రయోగించారు,కాని దాని ఉపసంహరణ ఎలా చేయాలో తెలియదు,అప్పటికే  అది చేయాల్సిన నష్టం చేసింది.ఇది కాంగ్రెస్ నూరవ తప్పుగా భావించవచ్చు.

ఎవరు అవునన్నా కాదన్నా,మన దేశ సంస్కృతీ సంప్రదాయాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి అంటే కారణం మహిళలు,వాళ్ళు పాటించడమే కాక తరువాతితరాలకు నేర్పిస్తారు.ఇది తరతరాలుగా వస్తున్నది.మన దేశ మహిళలలకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ,దీపం గాలికి ఆరిపోయినా,కర్పూర హారతి ఆరిపోయినా అది అపశకునంగా భావిస్తారు.ఇంట్లో ఏ చిన్న సంఘటననో,ప్రమామాదమో జరిగితే కారణం దీపం ఆరిపోవడమే అనుకుంటారు.పసుపు,కుంకుమ,పువ్వులు,గాజులు,చీర,రవిక ఇవి ముత్తైదువ లక్షణాలు వీటిని ఎవరిచ్చినా పుచ్చుకుంటారు,కాదు అని అనరుగాక అనరు.గాజులు పగిలినా వీళ్ళ గుండెలు పగులుతాయి.కుంకుమ భరిణ జారిపడ్డా,వీళ్ళ గుండెలు జారుతాయి.

అందులోనూ బతుకమ్మ అంటే పార్వతీ అమ్మవారు,పెద్ద ముత్తైదువ,అందరి ఇంటి ఆడపడుచు,ఆమె పేరు మీద ఇచ్చిన చీరలను కాంగ్రెస్ వాళ్ళు తగలబెడుతుంటే అసహాయులై అప్పటికప్పుడు ఏమీ చేయలేకపోయారు.కాని వాళ్ళ మనోభావాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి.అప్పటికే తెలంగాణ సమాజం మొత్తం కాంగ్రెస్ మీద తిరగబడింది.సోషల్ మీడియాలో ఉతికి ఆరేసింది.అన్ని వైపులనుండి వస్తున్న  విమర్శల శరపరంపర ను తట్టుకోలేకపోయారు.ఇష్టం లేకుంటే తీసుకోకూడదు కాని ఇలా తగలబెట్టడం ఏమిటి,ఇదెక్కడి దిక్కుమాలిన రాక్షస చర్య,అని నలువైపుల నుండి విమర్షల వర్షం కురిసింది.జరగాల్సిన నష్టం జరిగిపోయింది.తరువాత నష్టనివారణ చర్యల కు దిగినా కూడా ఎవరూ పట్టించుకోలేదు.

ప్రజా వ్యతిరేకతను గ్రహించిన మీడియా తెలివిగా తప్పుకున్నది,కాంగ్రెస్ నేరస్తురాలిగా నిలబడ్డది.తెలంగాణ వాదులు అడిగేది ఏమిటంటే ఈ పనికిమాలిన పనులు చేసే బదులు విభజన సమస్యలపై ఎందుకని పోరాటం చేయరు వీళ్ళు?హై కోర్టు విషయం లో ఎందుకని జోక్యం చేసుకోరు?ఉమ్మడి రాష్ట్రం లో ఏనాడైనా బతుకమ్మ ఆడిన ,ఆడించిన మోఖాలేనా ఇవ్వి,ఇప్పుడు వచ్చి నాణ్యత బాగాలేదు,ప్రింట్ బాగాలేదు అని తగలబెట్టడానికి వారికి ఉన్న హక్కేమిటి అని ప్రశ్నిస్తున్నారు?

ఉత్తం మాట్లాడుతూ చీరల దహనానికి కాంగ్రెస్ కు ఎటువంటి సంబంధం లేదు,అని స్టేట్ మెంట్ ఇచ్చాడు,ఇది చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం లాంటిదే.కాంగ్రెస్ నాయకుల్లారా,పోయి,పోయి మీరు మహిళల సెంటిమెంట్స్ ను హర్ట్ చేసారు.చీరలను తగలబెట్టడం ద్వారా తెలంగాణ ఆడపడుచుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీసారు.దీని పర్యవసానాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి.మీరు చేసిన అనాలోచిత చర్య వల్ల ఒక పెద్ద సెక్షన్ మీ నుండి దూరం అయ్యింది.రేపటి ఎన్నికల్లో మీ ఓటమికి నిన్ననే బీజం పడింది.ఇక మిమ్మల్ని ఆ `బతుకమ్మ`,కూడా కాపాడలేదు.మీ ఆగ్రహజ్వాల మీ గూటినే దహించివేసింది.

Top