You are here
Home > Latest News > బతుకులు బాగు చేస్తే మోసం చేసినట్టా?

బతుకులు బాగు చేస్తే మోసం చేసినట్టా?

Spread the love
  • తెలంగాణ దళితులంటే ఎందుకు కోపం అమిత్ షా?
  • వాళ్ల బతుకుల్లో వెలుగు నిండితే చూడలేకపోతున్నారా?
  •  పిల్లలు బాగుపడుతుంటే తట్టుకోలేకపోతున్నారా?

కరీంనగర్ వేదికగా.. తెలంగాణ దళితులపై తమలోని కుట్రపూరిత భావాలను బయటపెట్టుకున్నారు… బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. కేంద్రంలో అధికారం ఉన్నా కూడా ఇంత వరకూ దళితులను ఆదుకునేందుకు బడుగులను వృద్ధిలోకి తెచ్చేందుకు ఏ మాత్రం పాటు పడని చరిత్రను మూటగట్టుకున్న బీజేపీ నేతలు… రాష్ట్రంపై మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా కుట్రలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే… ఇప్పుడు ఎన్నికల సందర్భంలో.. దళితులపై మరోసారి కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారు.

తెలంగాణలో సంక్షేమ పథకాలను వెల్లువలా దళితులకు చేరవేరుస్తూ వారి ఆర్థిక ముఖ చిత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చేస్తున్నారు. పిల్లిలకు గురుకులాలు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయి విద్య కూడా అందిస్తున్నారు. ఇది మాత్రమే కాదు… సన్నబియ్యంతో పాటు… మరిన్ని పథకాలను అమలు చేస్తున్నారు. ప్రతి సంక్షేమ పథకాన్ని దళితులకు కచ్చితంగా అందేలా చర్యలు తీసుకుంటున్నారు. మూడెకరాల భూ పంపిణీ చేస్తుంటే.. తట్టుకోలేక విపక్షాలు కుట్రలు పన్నుతూ అడ్డుకుంటున్నాయి. అయినా.. అందుబాటులో ఉన్నంతవరకూ భూ పంపిణీ చేస్తూనే ఉన్నారు.

ఇంత చేసినా.. గత ప్రభుత్వాల కంటే వందల రెట్లు మెరుగైన పాలన అందిస్తున్నా… బీజేపీ నేతలకు పట్టడం లేదు. కేసీఆర్ ఇలాగే పరిపాలిస్తే తమకు భవిష్యత్తు లేదన్న బెంగే… బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. అందుకే.. కరీంనగర్ సభ సాక్షిగా… దళితుల విషయంలో ద్వంద్వ వైఖరిని ప్రదర్శించి అపఖ్యాతి మూటగట్టుకున్నారు… అమిత్ షా. ఇది చూసి రాష్ట్ర వ్యాప్తంగా దళితులంతా.. బీజేపీకి ఓట్లు వేయనే వేయవద్దని తీర్మానించుకుంటున్నారు.

కేసీఆర్ ను కాదని మరెవరిని ముఖ్యమంత్రిని చేసినా… ఈ అభివృద్ధి ఆగిపోతుందని.. మళ్లీ తమ బతుకులు పాడైపోతాయని దళితులు అర్థం చేసుకుంటున్నారు. అమిత్ షా లాంటి వాళ్లను నమ్మేది లేదని తేల్చి చెబుతున్నారు.

Top