You are here
Home > Latest News > బాబూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మీ పార్టీలోని నాయకులే కొట్టుకు చస్తున్నారు కదా..

బాబూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మీ పార్టీలోని నాయకులే కొట్టుకు చస్తున్నారు కదా..

Spread the love

 

  • నువ్వు పతీతవైతే.. నీ వర్గానికి, ఉత్తమ్ వర్గానికి ఎందుకు పడుతలేదు..
  • కుర్చీలతో కుమ్ములాటలాడే మీలాంటి నాయకులా తెలంగాణను పరిపాలించేది..
  • లొల్లి లేకుండా ఒక్క మీటింగ్ అయినా సక్కగా నిర్వహించారా?

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చే సీఎం ఎవరో కూడా తేల్చేసిండు. తెలంగాణకు రెండో సీఎం ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తే అని ఏదో పెద్ద ఘనకార్యం చేసినోడిలెక్క చెప్పిండు. వామ్మో.. ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ నాయకుల రాజకీయాలు ఎవరికి తెల్వవు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు.. నల్గొండ కాంగ్రెస్ నాయకులు ఎటువంటివాళ్లో.

తెలంగాణలో అధికారంలోకి వచ్చి మళ్లీ రాష్ట్రాన్ని ఎక్కడ తాకట్టు పెడతామనుకుంటున్నారు. దశాబ్దాలు పరిపాలించినప్పుడు గుర్తుకురాని అభివృద్ధి మీ పార్టీకి, నాయకులకు ఇప్పుడు గుర్తుకు వస్తున్నదా? ముందు మీ పార్టీలోని సమస్యలను తీర్చుకోండి. ఒక్కటంటే ఒక్క మీటింగ్ అన్నా ఏమాత్రం లొల్లి లేకుండా జరిపారా ఇప్పటి వరకు. లేదు. ఎప్పుడు చూడూ పదవి కోసం, పలుకుబడి కోసం, ఆ వర్గం, ఈ వర్గం అంటూ కొట్లాడుకుంటుంటారు. మీరా తెలంగాణను ఆదుకునేది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణను ఎప్పుడో అభివృద్ధి పథంలో నడిపించేవారు. కాని.. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంచిగా అందరి కడుపులు నింపుకున్నరు. తెలంగాణ జనాల నోట్లో మట్టి కొట్టారు. వాళ్ల ఉసురు ఊరికే పోదు.

 

 

ఇప్పుడు నువ్వు చెబుతున్న ఇదే భువనగిరి పార్లమెంటరీ స్థాయి కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో నీ వర్గీయులు, ఉత్తమ్ వర్గీయులు కొట్టుకున్నారు. తిట్టుకున్నారు. కుర్చీలు పగులగొట్టారు. మరి ఇదంతా ఏంది? ఈ వర్గాలు ఏంది.. విభేదాలు ఏంది. అది పార్టీయా లేక మరేమన్ననా? మీకు మీకే సక్కగ లేదు. మీరు మీరే ఓర్సుకోరు. ఒకరి మీద మరొకరంటే పడదు. మీరు తెలంగాణను సక్కదిద్దుతరు. తెలంగాణ ప్రజలు ఇదివరకే మిమ్మల్ని చీత్కరించారు. ఓట్ల రూపంలో ఛీపో.. అని తరిమేశారు. మళ్లీ ఏం మొహం పెట్టుకొని తెలంగాణలో అధికారంలోకి వద్దామనుకుంటున్నారు. మీ మోసపూరిత, మభ్యపెట్టే మాటలు నమ్మేవాళ్లు ఎవరూ లేరు. తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నరు. ఈసారి మీరు మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టకుండా చేస్తరు.

Top