You are here
Home > Latest News > బాబూ తమ్మినేని.. అసలు బీఎల్ఎఫ్ అనేది ఉందా తెలంగాణలో?

బాబూ తమ్మినేని.. అసలు బీఎల్ఎఫ్ అనేది ఉందా తెలంగాణలో?

Spread the love

 

  • ఎంతమందికి తెలుసు నీ ఫ్రంట్..
  • ఇప్పటివరకు మీరు తెలంగాణకు చేసిందేమీ లేదు..
  • గత నాలుగేళ్లలో సీఎం కేసీఆర్ ఏం చేశారో తెలంగాణ ప్రజలకు తెలుసు..

దశాబ్దాల పాటు తెలంగాణను పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుతిన్నప్పుడు ఎవ్వరూ దాన్ని నిలదీసిన పాపాన పోలేదు. చంద్రబాబు తొమ్మిదిన్నరేళ్లు పాలించి తెలంగాణను నట్టేట ముంచినా ఎవ్వరూ ఆయన్ను కాలర్ పట్టుకొని అడగలేదు. తెలంగాణను ఎందుకు నాశనం చేస్తున్నారంటూ ఒక్కరూ ముందుకురాలేదు. అప్పుడు వాళ్లకు తెలంగాణ మీద ప్రేమా గీమా ఏం లేవు. పోతేపోనీ మనకెందుకులే అని మూలకు కూర్చున్నారు. తెలంగాణను గత ప్రభుత్వాలు భ్రష్టు పట్టించినా ఒక్కరూ ప్రభుత్వాలను నిలదీయలేదు.

కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్కసారిగా తెలంగాణపై ప్రేమ పుట్టుకొచ్చింది. మామూలు ప్రేమ కాదు అది ఎంతలా అంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేంత. అద కపట ప్రేమ. దొంగ ఏడుపు. మొసలి కన్నీరు కారుస్తూ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు. అందులో ఈ తమ్మినేని వీరభద్రం కూడా ఒకడు. ఆయన ఏదో తెలంగాణను ఉద్ధరించినట్టు తెగ ఆయాసపడుతున్నడు. అయ్యా తమ్మినేని గారు.. మీరు తెలంగాణకు ఏం చేశారో కాస్త చెబుతారా? అని తెలంగాణ జనాలు అడుగుతున్నారు. ముందు అది చెప్పు.. తర్వాత కేసీఆర్ గురించి మాట్లాడుకోవచ్చు.. అంటూ తెలంగాణ జనాలు ప్రశ్నిస్తుంటే నీళ్లు నములుతున్నారు తమ్మినేని. ఎందుకంటే.. ఆయన తెలంగాణ కోసం చేసిందేమీ లేదు. పైపెచ్చు… ద్రోహం చేశాడు. తెలంగాణ ద్రోహి. ఇప్పుడు శుద్ధపూసలెక్క మాట్లాడుతున్నడు.

మీకు నిజంగా తెలంగాణ అభివృద్ధి చెందాలనే కాంక్ష ఉంటే తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి కానీ.. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడటమేంది. అసలు నీ ఫ్రంట్.. అదే బీఎల్ఎఫ్ అనేది తెలంగాణలో ఉన్నదా? ఎంతమంది తెలంగాణ జనాలకు తెలుసు నీ బీఎల్ఎఫ్. నువ్వూ నీ బీఎల్ఎఫ్ దేనికీ పనికిరారు. కేవలం తెలంగాణలో అధికారం కోసం మీరు తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ పై బురద జల్లుతున్నారు. తెలంగాణ ప్రజలకు తెల్వదా? గత నాలుగేళ్ల నుంచి సీఎం కేసీఆర్ ఏం చేశారో వాళ్లకు తెలుసు. ఎవరికి ఓటేయాలో కూడా వాళ్లకు తెలుసు. నువ్వు ఇప్పుడొచ్చి తెలంగాణ ప్రజలను ఏదో ఉద్దరించిన వ్యక్తిలా తెగ పోజులు కొట్టకు. నిన్ను.. నీ ఫ్రంట్, నీ కమ్యూనిస్టు పార్టీ అన్నింటినీ తెలంగాణ నుంచి తరిమికొట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

 

 

 

 

 

 

 

Top