You are here
Home > Latest News > బాబూ.. నీ ఫ్రంట్ ఏముందో చూసుకో ముందు!

బాబూ.. నీ ఫ్రంట్ ఏముందో చూసుకో ముందు!

Spread the love

జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేయబోతున్న ఫ్రంట్ చూసి చంద్రబాబు అప్పుడే భయపడిపోతున్నట్టున్నాడు. అందుకే.. ఫ్రంట్ లేదు.. ఏమీ లేదు.. అంతర్గత సమస్యలు ఏవో ఉన్నట్టున్నాయి అని అవాకులు చెవాకులు పేలుస్తూ.. కేసీఆర్ కు వస్తున్న ప్రాధాన్యతను డౌన్ ప్లే చేయాలని చూస్తున్నట్టున్నాడు. ఈ మాటలు ఆయన అన్నాడో లేదో కానీ.. ఇదే అభిప్రాయంతో చంద్రబాబు ఉంటే మాత్రం ఆయనకు ఓ విషయాన్ని స్పష్టం చేయదలిచాం.

జాతీయ ఫ్రంట్ విషయంలో కేసీఆర్ అడుగు పెట్టగానే.. పార్టీలు చాలా వరకూ స్పందించడం మొదలు పెట్టాయి. రాష్ట్రాల హక్కులపై చర్చలు కూడా అంతర్గతంగా నడుస్తూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న లక్నో నుంచి ఫ్లైటెక్కి మరీ సమాజ్ వాదీ అఖిలేష్ వచ్చి వెళ్లాడు. అలాగే.. ఇతర పార్టీల నేతలూ స్పందిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆరా తీస్తున్నారంటే.. విషయం ఎంత వరకూ వెళ్లిందన్నదీ చంద్రబాబు అర్థం చేసుకోవాలి.

అంతే కానీ.. ఫ్రంట్ లేదు ఏమీ లేదు.. అంటే.. తెలంగాణలో ఇప్పటికే ఫ్రంట్ ఫుట్ లేకుండా పోయిన టీడీపీకి.. ఉన్న మిగతా ఫూట్ కూడా లేకుండా చేసేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారు. రాజకీయంగా చేవచచ్చిపోయినా కూడా ఇలాంటి చిల్లర మాటలెందుకు చంద్రబాబూ.. అని జనాలు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. ఎలాగూ కాంగ్రెస్ తో కలిసి పని చేయలేదు.. బీజేపీతోనూ కలవలేవు. అలాంటపుడు.. నీకు కేసీఆర్ దిక్కుగా మారబోతున్నారు. ఆలోచించుకో చంద్రబాబు.. ఆలోచించి నోటిని వాడు.

Top