You are here
Home > Latest News > బాబూ రాజాం…. కేసీఆర్ ఫోన్ చేసి చెప్పారా నీకు?

బాబూ రాజాం…. కేసీఆర్ ఫోన్ చేసి చెప్పారా నీకు?

Spread the love

 

 

  • అసెంబ్లీ రద్దుపై టీఆర్ఎస్ ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాలు
  • సర్వేల పేరుతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్న తీరు
  • అబద్ధాల ఫలితాలు చెబుతూ ప్రజాస్వామ్య ద్రోహులుగా మారే ప్రయత్నం

రాష్ట్రానికి విజయక్రాంతి పత్రిక చీడపురుగులా మారింది. తప్పుడు సర్వేలు ప్రచురిస్తూ ప్రజాభిప్రాయాన్ని ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. అధికార పక్షానికి అవసరం లేకున్నా వ్యతిరేక వార్తలు రాస్తూ తన బుద్ధిని బయటపెట్టుకుంటోంది. రాష్ట్రంలోఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వందకు తక్కువ కాకుండా స్థానాలు టీఆర్ఎస్ సొంతమవుతాయని ఏ సర్వే జరిగినా ఫలితం వస్తోంది.

కాంగ్రెస్ తో పాటు… టీడీపీ, బీజేపీ నేతలు కూడా సర్వేలు చేస్తున్నా అవే ఫలితాలు వస్తున్నాయి. అందుకే.. ఆ పార్టీలు కూడా టీఆర్ఎస్ చేసిన ఫలితాన్ని ఏనాడూ ఖండించడం లేదు. అధికార పార్టీకి వందకు పైగా స్థానాలు వస్తాయన్న వాదనను ఎవరూ కూడా ఖండించడం లేదు. ఇలాంటి సమయంలో… విజయక్రాంతి అనే ప్రజాదరణ లేని పత్రిక ఓ నిరర్థక కథనాన్ని ప్రచురించి అభాసుపాలైంది.

23 చోట్ల కాంగ్రెస్, బీజేపీ నుంచి తీవ్ర పోటీ అని కూడా ఓ మాట చెప్పింది. కానీ… హైదరాబాద్ పరిధిలో ఐదు స్థానాలు తప్ప..  రాష్ట్రంలో ఎక్కడా బీజేపీకి బలం లేదు. బలగం లేదు. ఆఖరికి ఐదుగురు ఎమ్మెల్యేలున్నా కూడా… గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క కార్పొరేటర్ స్థానాన్ని కూడా దక్కించుకోలేదు. అలాంటి పార్టీ టీఆర్ఎస్ కు ఎలా పోటీ అవుతుంది? ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే… రోజురోజుకూ పార్టీకి ప్రజల్లో పలుకుబడి తగ్గిపోతోంది. ఆ పార్టీ కేడర్ ను అడిగితే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. అలాంటి పార్టీ టీఆర్ఎస్ కు ఎలా పోటీ అవుతుంది?

ఈ మాత్రం రాజకీయ అవగాహన లేని మూర్ఖులు… కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలన్న తలంపుతోనే ఈ వార్త ప్రచురించినట్టు అర్థమవుతోంది. అందుకే… ఆ పత్రికలో వచ్చే వార్తలను ఏ మాత్రం నమ్మే పరిస్థితే లేదని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఆ పత్రికలను చిత్తు కాగితాల్లా వాడుకోవడానికి తప్ప మెందుకూ పనికి వచ్చే అవకాశమే లేదని చెబుతున్నారు.

Top