You are here
Home > Latest News > బీజేపీపైనా కాగ్ బాంబ్ పేల్చింది.

బీజేపీపైనా కాగ్ బాంబ్ పేల్చింది.

Spread the love
  1. విలాసాల టూర్లు, అక్కరకు రాని బిజినెస్ ట్రిప్ లు.
  2. పెట్టుబడుల వంకతో చేసిన ఖర్చులన్నీ ఆర్థికభారమే.
  3. ఇదే విషయాన్ని కాగ్ బయటపెట్టింది.
  4. నోట్ల రద్దుతో ప్రభుత్వానికి ఒరిగిందేమీ లేదని చెప్పింది.
  5. అంతేకాదు.. 2జీలో నిందితులు బయటకు రావడం బీజేపీ దుర్భుద్ధికి నిదర్శనం.

తాము నీతిమంతులమని చెప్పుకునే బీజేపీని కూడా కాగ్ తప్పు పట్టింది. నోట్ల రద్దు నుంచి విదేశీ టూర్లు, పెట్టుబడుల సాకుతో చేసిన ఖర్చు అంతా ఇంతా కాదని నివేదిక ఇచ్చింది. పెట్రో ఉత్పత్తుల వ్యవహారాల్లోనూ, ధరల నిర్ణయంలోనూ ప్రజల్ని బలిపశువుల్ని చేశారని తప్పు పట్టింది. వేల కోట్ల స్కాంలు బయటకు రాకుండా మేనేజ్ చేస్తున్నారనేది కాగ్ రిపోర్ట్ పరిశీలిస్తే తెలుస్తుంది. కాంగ్రెస్ హయాంలో లక్ష కోట్లకు పైగా కుంభకోణంలో అరెస్ట్ అయిన రాజా, కనిమొళి నిర్దోషులుగా బయటకు రావడం బీజేపీ మేనేజ్ మెంట్ ఏ విధంగా ఉంటుందో చాటి చెబుతోంది.
ఒకే సంస్థకు 11 బొగ్గు గనులు కట్టబెట్టడం. ప్రైవేట్ సంస్థలకు, కార్పొరేట్ శక్తులకు కాంట్రాక్టులు ఇవ్వడంతో బీహెచ్ఈఎల్ లాంటి ప్రభుత్వం సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి బీజేపీ నిర్ణయాలే కారణమని చెప్పింది కాగ్. అంతేకాదు LPG గ్యాస్ స్కాంలో మోడీ సర్కార్ 23000 కోట్లు మిగిల్చినట్లు దేశానికి అబద్దాలు చెప్తే… CAG అది 1764 కోట్లేనని…అది కూడా ప్రజలే స్వఛ్ఛందంగా సబ్సిడీ వదులుకోవడం వల్ల సాధ్యమైందని…మిగిలిన డబ్బు గ్యాస్ రేట్లు తగ్గడం వల్లేగాని మోడీ వల్ల కాదని అక్షింతలు వేసింది. కేజీ బేసిన్ ను కూడా తక్కువకే రిలయన్స్ కు కట్టబెట్టిందని చెప్పింది కాగ్.
టెలికామ్ రంగంలో 45వేల కోట్లకు పైగా స్కామ్ జరిగిందని సంచలన ఆరోపణలు కాంగ్రెస్ చేస్తోంది. కాగ్ బయటపెట్టిన ఈ కుంభకోణంతో ప్రమేయమున్న 6 ప్రముఖ టెలికాం సంస్థలను కాపాడేందుకు మోడీ ప్రభుత్వం తెరవెనుక చర్యలకు దిగిందని ఆరోపించింది. ఈ కుంభకోణం విలువ 45 వేల కోట్లకు పై మాటేనని కాంగ్రెస్ విమర్శిస్తోంది. దానిని మోడీ సర్కారు చాప కింద దాచేస్తోంది. భారతి ఎయిర్ టెల్, వొడాఫోన్, రిలయన్స్, ఐడియా, టాటా, ఎయిర్ సెల్ టెలికాం సంస్థలు ప్రభుత్వానికి న్యాయంగా చెల్లించాల్సిన చార్జీలను ఎగవేసేందుకు ప్రభుత్వం సాయం చేస్తోందనే ఆరోపణలున్నాయి.
ప్రధానమంత్రి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆమోదించనిదే ఇవన్నీ జరగబోవనేది క్లియర్ గా తెలుస్తోంది. తెలంగాణ సర్కార్ పై కాగ్ రిపోర్ట్ మీద అడ్డగోలుగా మాట్లాడుతున్న బీజేపీ నాయకులు. మరి కేంద్రం చేస్తున్న స్కాములపై మాట్లాడే దమ్ముందా?. ప్రజలకు ఏం సమాధానం చెబుతారు.

Top