You are here
Home > Uncategorized > బీజేపీ అనేది తెలంగాణలో ఉందా? ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో బీజేపీ పార్టీ అంటే తెలియని వాళ్లు కోకొల్లలు..

బీజేపీ అనేది తెలంగాణలో ఉందా? ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో బీజేపీ పార్టీ అంటే తెలియని వాళ్లు కోకొల్లలు..

Spread the love

బీజేపీ అనేది తెలంగాణలో ఉందా?

ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో బీజేపీ పార్టీ అంటే తెలియని వాళ్లు కోకొల్లలు..

ఉన్నమాటంటే ఉలుకెందుకు నీకు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్..

నువ్వు తెలంగాణ కోసం ఏం చేశావో చెప్పు ముందు..

అవును.. నిజమే కదా.. తెలంగాణ బీజేపీ అనేదే లేదు. ఇది సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీ స్థానమేందో దేశమంతా తెలుసు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలో బీజేపీ ప్రాబల్యం ఎక్కడున్నది. ఇప్పుడు తెలంగాణకు వద్దాం. తెలంగాణలో బీజేపీ అనేదే లేదు. బీజేపీ అంటేనే తెలంగాణ జనాలకు తెలియదు. తెలంగాణ బీజేపీ నాయకులు కూడా ఏనాడూ తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచించింది లేదు. ఏనాడూ తెలంగాణ కోసం పాటుపడింది లేదు. కనీసం విభజన చట్టంలోని హామీల గురించి ఏనాడైన కేంద్రంతో పోరాడారా? మీకు తెలంగాణపై ఉన్న ప్రేమ ఏది?

ఏడబోయింది చెప్పు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. తెగ ఆయాసపడుతున్నావు కదా నువ్వు.. నువ్వు తెలంగాణకు ఏం చేశావో చెప్పు. చెప్పగలవా? తెలంగాణ బీజేపీ నాయకుల వల్ల తెలంగాణకు పైసా ఫైదా లేదు. మీవల్ల తెలంగాణకు ఏ ఉపయోగం లేనప్పుడు తెలంగాణకు మీ అవసరం ఏముంది. అందుకే తెలంగాణ ప్రజలు మీ పార్టీని వదిలేశారు. కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది. అయినా.. ఏనాడై తెలంగాణకు రావాల్సిన హామీలపై మీరు ఒక్కసారి కూడా కేంద్రాన్ని అడగలేదు. కేంద్రం వద్దకు పోలేదు. ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు తెలంగాణను ఏలుదాం అని అనుకుంటున్నారు.

ఈ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఏదో పెద్ద తోపు అనుకుంటున్నాడేమో.. బాబు ప్రభాకరు.. అసలు నీ నియోజకవర్గంలో కూడా నువ్వెవరో తెలియదు. ఇక.. నువ్వా తెలంగాణ సంక్షేమం గురించి ఆలోచిస్తున్నావా? సిగ్గుండాలి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే మీరు విభజన చట్టంలోని హామీలపై కేంద్రంతో పోరాడేవారు. కానీ.. మీకు అంత సీను లేదు. మీకు తెలంగాణపై ఉన్నది కపట ప్రేమ. అందుకే తెలంగాణ ప్రజలు కూడా మిమ్మల్ని లైట్ తీసుకున్నరు. వంద జన్మలెత్తినా మీరు తెలంగాణలో అధికారంలోకి రాలేరు.

Top