You are here
Home > Latest News > బీజేపీ నేతల కలలు కనే కాలాలు!

బీజేపీ నేతల కలలు కనే కాలాలు!

Spread the love

కలలు గనే కాలాలూ.. కరిగిపోవు సమయాలూ.. అని ఓ పాట ఉంది. వాస్తవానికి అది విరహ గీతం అయినా.. ఇప్పుడు అధికార దాహంతో అలమటించిపోతున్న బీజేపీకి సరిగ్గా సూటయ్యేలాగే కనిపిస్తోంది. ఎందుకంటే.. ఎలాగూ తమ ప్రయత్నం ఫలించదు. అయినా ఆశ చావదు. తమ బలంపై అతి నమ్మకం. ఆపై చేతగాని తనం. జనాన్ని నమ్మించలేని అసమర్థ వ్యవహారం. వెరసి.. జనాల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేని రాజకీయశక్తిగా ముద్ర వేయించుకోవడం.

ఇదీ.. ఇప్పుడు తెలంగాణ గడ్డపై.. బీజేపీ పరిస్థితి. ఇంతగా ఆ పార్టీ దిగజారిపోయి ఉన్నా.. ప్రస్తుతం కేవలం ఐదు అసెంబ్లీ సీట్లకే పరిమితమై ఉన్నా.. తమకు బలం ఎక్కువ అని చెప్పుకొనే హైదరాబాద్ లో.. గ్రేటర్ పరిధిలో ఒక్క కార్పొరేటర్ కూడా లేకపోయినా.. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధిస్తామని చెప్పుకోవడాన్ని చూస్తే ఏమనాలి? వీరిది అతి నమ్మకమా? లేకుంటే.. కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డు పెట్టుకుని భవిష్యత్తులో కుట్రలు చేయబోతున్న సంకేతమా?

ఎందుకంటే.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను తమకు అనుకూలంగా మార్చుకుంటే.. బీజేపీ నేతలు సులువుగానే తమ లక్ష్యాన్ని చేరుకోవచ్చని.. కేంద్రంలో వచ్చే ఎన్నికల్లో అలాంటి కుట్రలకు ఉన్న అవకాశాలను కొట్టిపారేయలేమని.. కొందరు అనుమానిస్తున్నారు. జీవీఎల్ మాటలు వింటుంటే.. ఇది నిజమే అని కూడా మరో అనుమానం పుట్టుకొస్తోంది. కానీ.. ప్రజలు మాత్రం.. తమ పరిధిలో అవకాశం ఉన్నంత వరకూ.. ఈ సారి బీజేపీని భూస్థాపితం చేసి.. కేసీఆర్ హవాను జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు చిత్తశుద్ధితో ఉన్నారు.

Top