You are here
Home > Latest News > బీజేపీ భ్రమలే.. టీఆర్ఎస్ కు శ్రీరామరక్ష

బీజేపీ భ్రమలే.. టీఆర్ఎస్ కు శ్రీరామరక్ష

Spread the love

 

  • – జనాల్లోకి వెళ్లకుండా విమర్శలతోనే గడుపుతున్న బీజేపీ
  • – కేసీఆర్ అంచనాలు తారుమారవుతాయని పగటి కలలు
  • – అతీగతీ లేని రాజకీయంతో పరువు పోగొట్టుకుంటున్న తీరు

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. టీఆర్ఎస్ విజయం ఖాయమైపోయింది. ఎందుకంటే… విపక్షాలన్నీ ఒక్కటిగా కలిసి మహా కూటమిగా ఏర్పాటు కావాలన్న ఆలోచనకు కోదండరాం ఇప్పటికే గండి కొట్టారు. కమ్యూనిస్టు పార్టీలకు ఎలాగూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సీన్ లేదు. మిగిలిన బీజేపీ కూడా… ఉన్న ఐదు సీట్లను కూడా కోల్పోయేలా పిచ్చికూతలు కూస్తూ జనాగ్రహానికి గురవుతోంది. దీంతో… మంచి చేస్తూ సంక్షేమాన్ని జనానికి చేరువ చేస్తున్న కేసీఆర్ పరిపాలననే ఓటర్లు మరోసారి కోరుకుంటున్నట్టు తేలిపోతోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ నేతలను మించి బీజేపీ నేతలు భ్రమల్లో బతుకుతుండడాన్ని ఓటర్లు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ అంచనాలు తారుమారు కావడం ఖాయమన్న మురళీధర్ రావు లాంటి నేతల వ్యాఖ్యలను జనాలు లైట్ తీసుకుంటున్నారు. కేంద్రం ఏం చేస్తోందో.. ఏం చేయడం లేదో తమకు తెలియడం లేదని.. పుట్టిన బిడ్డ నుంచి పండు ముదుసలి వరకూ అండగా ఉంటున్న కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనే తమకు తెలుసని ఓటర్లు స్పష్టం చేస్తున్నారు.

సర్వేలు చెబుతున్నట్టుగానే.. తాము కేసీఆర్ కు తప్ప మరెవరికీ ఓటు వేసేది లేదని.. ఆ సర్వేలన్నీ నిజమే అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తేల్చి చెబుతున్నారు. బీజేపీ వస్తే మరిన్ని మండలాలను ఏపీకి అప్పగించినా ఆశ్చర్యపోనవసరం లేదని.. కాంగ్రెస్ విష కూటమి వస్తే మళ్లీ ఆత్మహత్యలే గతి అని జనాలు అభిప్రాయపడుతున్నారు. అందుకే.. మురళీధర్ రావు లాంటి నేతలు ఏం మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. బంగారు తెలంగాణ సాధన దిశగా పడిన అడుగులు గమ్యం చేరాలంటే టీఆర్ఎస్ మళ్లీ రావాల్సిందేనని బల్లగుద్ధి మరీ చెబుతున్నారు.

Top