You are here
Home > Latest News >  బ్రీఫింగ్ రజ్వీలా వ్యవహరిస్తున్న బాబు!

 బ్రీఫింగ్ రజ్వీలా వ్యవహరిస్తున్న బాబు!

Spread the love

 

– కేసీఆర్ ను విమర్శిస్తూ బాబును మరుస్తున్న తమ్ముళ్లు

– తెలంగాణ తమ్ముళ్లకు కుట్రలను బ్రీఫుతున్న బాబు

– అడ్డంగా బలైపోతున్న తెలుగుదేశం శ్రేణులు

చేజేతులా పార్టీని ఎలా సర్వ నాశనం చేసుకోవాలి? అర్థం పర్థం లేని విమర్శలు చేస్తూ జనంలో ఎలా పరువు పోగొట్టుకోవాలి? తమ అధినేత చేసిన తప్పును కప్పిపుచ్చుతూ… ఎదుటి వారిని ఎలా విమర్శించాలి? ఓవరాల్ గా చెప్పాలంటే సిగ్గూ ఎగ్గూ లేని రాజకీయాలు ఎలా చేయాలి? వీటికి సమాధానం తెలుగుదేశం పార్టీ నేతలు తప్ప మరెవరూ చెప్పలేరు.

ఇన్నాళ్లూ ఓటుకు నోటు కేసుతో అడ్డంగా జనంలో బుక్కైపోయి బ్రీఫ్డ్ బాబుగా మారిన చంద్రబాబు… ఇప్పుడు తన పార్టీ తెలంగాణ నేతలకు కూడా కుట్రలపై కొత్తగా బ్రీఫేస్తున్నట్టున్నారు. కేసీఆర్ ను తిట్టడం ఒక్కటే కాన్సెప్టు… అన్నట్టుగా వ్యవహరిస్తూ రమణ లాంటి నోట్లో నాలుక లేని నాయకులతో కామెంట్లు చేయిస్తున్నారు. కేసీఆర్ ను ఖాసిం రజ్వీ అని అనిపిస్తూ వచ్చే ఓట్లను కూడా పోగొట్టుకుంటున్నారు.

అప్పుడు రేవంత్ రెడ్డికి బ్రీఫిన బాబే… ఇప్పుడు రమణకూ కుట్రలను బ్రీఫుతూ మళ్లీ ఫెయిలైపోతున్నారని జనం జోకులేసుకుంటున్నారు. అయినా కూడా అధినేత బ్రీఫులను జనానికి వదలడంలో ఏ మాత్రం సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారు టీడీపీ రాష్ట్ర నేతలు. ఇదంతా చూసి రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యాన్ని, అసహ్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓడిపోబోయేదానికి ఎందుకీ వృథా ప్రయాస అని నిట్టూరుస్తున్నారు.

తెలుగుదేశానికి ఓటు బ్యాంకు కూడా లేదని సర్వేలు నిరూపిస్తుంటే.. ఆ పార్టీ ఒక్క స్థానాన్ని గెలుచుకోవడం కూడా కష్టమే అని తేలిపోతుంటే… ఇంకా కేసీఆర్ లాంటి కొండను ఢీ కొని ఎందుకు అనవసరంగా సాహసం చేస్తారు… అని టీడీపీ నేతలకు… ముఖ్యంగా చంద్రబాబుకు సూచనలు అందుతున్నాయి.

Top