You are here
Home > Latest News > భట్టి విక్రమార్క… నువ్వు తెలంగాణ బాగు గురించి మాట్లాడుతున్నావా?

భట్టి విక్రమార్క… నువ్వు తెలంగాణ బాగు గురించి మాట్లాడుతున్నావా?

Spread the love
  • భట్టి విక్రమార్క… నువ్వు తెలంగాణ బాగు గురించి మాట్లాడుతున్నావా?
  • తెలంగాణను నాశనం చేసి ఇప్పుడు శుద్ధపలుకులు పలుకుతున్నారా?
  • మీ హయాంలోనే వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించిన సంగతి మరిచిపోతివా?
  • రోగాల తెలంగాణ నుంచి ఆరోగ్య తెలంగాణగా సీఎం కేసీఆర్ మార్చారు

ఇది వర్షాకాలం సీజన్. సీజన్ వ్యాధులు రావడం అనేది కామన్. ఒక్క తెలంగాణలోనే కాదు.. యావత్ దేశమంతా ఎక్కడికి వెళ్లినా విష జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. విష జ్వరాలు, వైరస్ సోకకుండా… రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో అప్రమత్తమైంది. వైద్య సిబ్బంది కూడా విష జ్వరాలపై అప్రమత్తంగా ఉన్నారు. రోగులకు చికిత్స అందిస్తున్నారు. కానీ.. దాంట్లో కూడా తప్పులు వెతుకుతూ… తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లుతున్నాడు మిస్టర్ భట్టి విక్రమార్క. మీ కాంగ్రెస్ నేతలకు ఏం పనీ పాటా ఉండదనుకుంటా. ఎప్పుడూ తెలంగాణ ప్రభుత్వం మీద పడి ఏడ్వడం తప్పితే.

భట్టి… మీరు ఒక విషయాన్ని మరిచిపోతున్నారు. తెలంగాణలో వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించింది మీరే అని మరిచిపోతున్నారు. తెలంగాణలో వైద్య రంగాన్ని నాశనం చేసి… అంతా దోచుకుతిని… ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడేలా చేశారు. ఇప్పుడు శుద్ధపూసల్లా మాట్లాడుతున్నారా? మీకు కొంచెమైనా ఉంటే ఇలా మాట్లాడరు. 40 ఏళ్ల హయాంలో వైద్యం రంగంలో మీరు ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. కావాలని ప్రభుత్వంపై నిందలు వేసి ఏదో సాధించాలని అనుకుంటే దాని వల్ల మీకు వచ్చేదేమీ ఉండదు. కాస్త పరిణతితో ఆలోచించండి. అయినా కాంగ్రెస్ నాయకులకు పరిణతితో ఆలోచించే సీనే ఉంటే ఇలా ఎందుకు ఉంటుంది. వాళ్లను తెలంగాణ ప్రజలు ఎందుకు ఓడిస్తారు.

ఇప్పుడు తెలంగాణ ఎలా ఉందో దేశమంతా తెలుసు. ప్రతి ఒక్కరు నేడు తెలంగాణ గురించి.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించే మాట్లాడుతున్నారు. బంగారు తెలంగాణ మీ 40 ఏళ్ల పాలనలో సాకారం కాలేదు. కానీ.. కేవలం 5 ఏళ్లలోనే సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణగా మార్చి చూపించారు. అది బంగారు తెలంగాణ అంటే. సర్కార్ ఆసుపత్రుల్లో మీ మొహానికి ఏనాడైనా సరైన సౌకర్యాలు కల్పించారా? ఇప్పుడు చూడండి వెళ్లి.. సర్కారు దవాఖానలు కార్పొరేట్ ఆసుపత్రులను తలపిస్తున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో దొరికే ఖరీదైన వైద్యం కూడా ఇప్పుడు సర్కారు ఆసుపత్రుల్లో ఉచితంగా దొరుకుతోంది. అన్ని రకాల మిషినరీలు అందుబాటులో ఉన్నాయి. కానీ.. మీరు మాత్రం సర్కారు దవాఖానలను పట్టించుకోకుండా అందినకాడికి దోచుకుతిన్నారు. ఇప్పుడు శుద్ధపూసలెక్క మాట్లాడుతున్నారు. కొంచెమైనా సిగ్గుండాలి అలాంటి పిచ్చి కూతలు కూయడానికి. ఇప్పుడు తెలంగాణ ప్రజల సానుభూతి కోసం నటిస్తున్నారా? ఇలా నటించి మీరు సాధించేది ఏమీ ఉండదు.

Top