You are here
Home > Latest News > భట్టీ… మతి ఉండే మాట్లాడుతున్నావా?

భట్టీ… మతి ఉండే మాట్లాడుతున్నావా?

Spread the love

 

– తెలంగాణను కాంగ్రెస్ ఏర్పాటు చేసిందని ప్రగల్భాలు

– టీఆర్ఎస్ పోరాటాన్ని మరుగున పడేసే యత్నం

– ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే అక్కసు చూపుతున్న నేతలు

ఓ వైపు ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. మరోవైపు పథకాలు శరవేగంగా పేదలకు అందుతున్నాయి. సంక్షేమ రంగంలో దేశానికే ఆదర్శంగా రాష్ట్రం ఎదుగుతోంది. ఇవన్నీ తట్టుకోలేకే కాంగ్రెస్ నేతలు కుట్రలు మొదలు పెట్టారు. వాటిని తీవ్రం చేశారు. అందుకే… ప్రజా సంక్షేమం కోసం తెగించిన రాష్ట్ర ప్రభుత్వం 9 నెలల ముందే ఎన్నికలకు వెళ్లి తన చిత్తశుద్ధిని చాటుకుంది. అయినా సిగ్గు తెచ్చుకోని ప్రతిపక్ష నేతలు.. తమ కుట్రలకు మరింత పదును పెట్టే యత్నం చేస్తున్నారు.

మధిరలో కాంగ్రెస్ తరఫున యాత్ర చేసిన భట్టి విక్రమార్క.. తమ కారణంగానే తెలంగాణ ఏర్పాటు అయ్యిందని చెబుతున్నారు. ఇది… టెన్త్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థిని చూపించి… నేను పేపర్లు దిద్దాను కాబట్టే అతనికి ఈ ఘనత సాధ్యమైందని చెప్పినట్టు ఉంది. ఎందుకంటే.. పోరాటం చేసింది టీఆర్ఎస్ పార్టీ. వందల మంది ఆత్మ బలిదానాలను జాతీయ స్థాయికి ఎలుగెత్తింది టీఆర్ఎస్ పార్టీ. నాలుగున్నర కోట్ల జనాల ఆకాంక్షలను దేశంలో ఇతర పార్టీలకు అర్థమయ్యేలా చాటింది టీఆర్ఎస్ పార్టీ.

ఇదేదీ పట్టించుకోకుండా… తామే తెలంగాణ ఏర్పాటు చేశామని చెబుతుంటే.. రాహుల్ ను ప్రధానిని చేద్దామని పిలుపునిస్తుంటే విని ఓట్లేసేందుకు తెలంగాణ ప్రజలు ఏమన్నా కాంగ్రెస్ నేతల్లా, కాంగ్రెస్ కార్యకర్తల్లా వెర్రిపప్పలనుకున్నారా? వాళ్లకు విజ్ఞత ఉంది. ఎవరు తెలంగాణ సాధించారన్నదానిపై స్పష్టత ఉంది. ఎవరికి ఓటు వేస్తే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందోనన్న ఆలోచన ఉంది.

అందుకే… కాంగ్రెస్ నేతలారా? మీరెన్ని ప్రలోభాలకు గురి చేసినా… మీరెన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు మారరు. వారు నీతికి, నిజాయితీకి మారుపేరైన కేసీఆర్ నాయకత్వాన్ని, కేసీఆర్ పరిపాలననే కోరుకుంటున్నారు. కేసీఆర్ నే మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు నిర్ణయించారు.

Top