You are here
Home > Latest News > మంచికి చెడు ఎదురవ్వడం అంటే ఇదే!!

మంచికి చెడు ఎదురవ్వడం అంటే ఇదే!!

Spread the love

 

– లక్షల ఎకరాలు సాగు చేసేలా సీఎం ప్రణాళిక

– సీఎం ప్లాన్ ను తప్పుబడుతూ కోదండరాం కుట్ర

– బడ్జెట్ లెక్కలపైనా అవగాహన లేని విశ్లేషణ

కోదండరాం ఎందుకు రాజకీయాలకు పనికిరాడు అన్న విషయాన్ని ఇన్నాళ్లుగా చెబుతూనే ఉన్నాం. జనాలు కూడా అంగీకరించేస్తున్నారు. ఇప్పుడు తనకు తానుగా… రాజకీయాలకు పనికిరాని వ్యక్తిగా కోదండరామే స్వయంగా నిరూపించుకుంటున్నాడు. బడ్జెట్ లెక్కలను తప్పుగా చూపిస్తూ ఏ మాత్రం ఆర్థిక అవగాహన లేని వ్యక్తిగా తేలిపోయాడు. ప్రాజెక్టులకు రీ డిజైన్ చేయడంతో లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిన విషయాన్ని అంగీకరించకుండా అన్నదాతలకు వ్యతిరేకంగా కుట్రల మీద కుట్రలు చేస్తున్నాడు.

ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వస్తున్నా కూడా… కేవలం కొన్ని ఎకరాల భూ వివాదాన్ని రాజకీయం చేస్తూ… రైతులతో నిరంతర ఆందోళన చేయించి వారి పొట్ట కొట్టే ప్రయత్నం చేసిన కోదండరాం… రాష్ట్రానికి చీడపురుగులా… సాగుకు వ్యతిరేకిగా చాటుకున్నాడు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా… అదే తీరును ప్రదర్శిస్తున్నాడు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రిని విమర్శిస్తూ పరువు పోగొట్టుకుంటున్నాడు.

సభ్యత్వానికి కూడా 10 రూపాయలు వసూలు చేస్తున్న దుర్మార్గమైన అధినేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాళేశ్వరం బదులు తుమ్మిడిహట్టి కడితే డబ్బులు ఆదా అయ్యేవంటున్న ఆయన… తగ్గిపోయే సాగు విస్తీర్ణాన్ని ఎందుకు చెప్పడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై కుట్రలు చేయడమే లక్ష్యంగా ఇలాంటి పని చేస్తున్న విషయాన్ని ఇప్పటికైనా కోదండరాం మద్దతుదారులు గుర్తించాలి.

కొన్నేళ్లుగా తెలంగాణకు బద్ధ వ్యతిరేకిగా మారి… తెలంగాణ సమాజ అభివృద్ధికి విద్రోహ శక్తిగా రూపుదిద్దుకున్న కోదండరాంను ఈ ఎన్నికల్లో ప్రజలు తరిమికొట్టాలి.

Top