You are here
Home > Latest News > మంచి చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవాలా?

మంచి చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవాలా?

Spread the love

 

  • – కేసీఆర్ పరిపాలన విశిష్టతపై విమర్శలా?
  • – మంచి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పా?
  • – నోటికొచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పై మళ్లీ ప్రతీకారం తప్పదు

ఉత్తమ్ కుమార్ రెడ్డీ… నోటికి అన్నం తింటున్నావా… అశుద్ధం తింటున్నావా? జనానికి మంచి చేయడమే కేసీఆర్ చేసిన తప్పా? ఇంటింటికీ సంక్షేమాన్ని అమలు చేసేందుకు అవినీతి రహితంగా వేల కోట్లు వెచ్చించడమే ఆయన చేసిన తప్పా? జనాలను ప్రతీకారం తీర్చుకోవాలని ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నావు కదా… ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలి? ఇచ్చిన హామీలే కాదు. ఇవ్వని హామీలు కూడా తీర్చారు.

పుట్టిన బిడ్డ దగ్గరి నుంచి పండు ముదుసలి వరకూ ప్రభుత్వమే బాధ్యత తీసుకునేలా పథకాలు అమలు చేస్తున్నారు. ఆడబిడ్డల కష్టాలు తీర్చేలా… పుట్టిన దగ్గర్నుంచి పెళ్లయ్యే వరకూ ఓ తోబుట్టువులా తోడు నిలిచేలా కార్యక్రమాలు రూపొందించారు. వాటిని అద్భుతంగా అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ పల్లెకు వెళ్లినా సాగుతో పొలాలు కళకళలాడుతున్నాయి. పెన్షన్లు అందుతున్నాయి. జీవితాలు బాగుపడుతున్నాయి.

బంగారు తెలంగాణ దిశగా అడుగులు కూడా వేగంగా పడుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే కదా… కేసీఆర్ కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందన్న కాంగ్రెస్ నేతలు కుట్ర చేసింది? ఆ కుట్రలు అడ్డుకునేందుకే.. సంక్షేమాన్ని సమర్థంగా అమలు చేసేందుకే కదా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది? అది తట్టుకోలేకే కదా… ఇప్పుడు జనాన్ని ఇలా ఉసిగొల్పే ప్రయత్నం చేస్తోంది?

ఓ వాస్తవాన్ని అర్థం చేసుకో ఉత్తమ్ కుమార్ రెడ్డీ… నీకు మాత్రమే కాదు. నీ పార్టీకి కూడా రోజులు దగ్గర పడ్డాయ్. మీరు చేసే కుట్రలకు చరమగీతం పాడేందుకే ప్రజలే కేసీఆర్ తో ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా చేశారు. రాబోయే తీర్పు కూడా కాంగ్రెస్ కూసాలు కదిలిపోయి చరిత్రలో కలిసిపోయేలా ఇవ్వనున్నారు. ఎన్ని కుట్రలైనా చేయండి. జనాన్ని ఎలా అయినా ఉసిగొల్పండి. అది బూమరాంగ్ అయ్యి… మీకే తగలడం ఖాయం. కేసీఆర్ ప్రభుత్వమే మరోసారి అధికారంలోకి రావడం తథ్యం.

Top