You are here
Home > Latest News > మతపరమైన రిజర్వేషన్లు ప్రకటించకూడదా కిషన్ రెడ్డి..

మతపరమైన రిజర్వేషన్లు ప్రకటించకూడదా కిషన్ రెడ్డి..

Spread the love

 

  • మతపరమైన రిజర్వేషన్లు కావాలనుకుంటే టీఆర్ఎస్ ను గెలిపించుకోవాలా?
  • వద్దనుకుంటే బీజేపీని గెలిపించుకోవాలా?
  • సన్నాసిలా మాట్లాడుతున్నావు కిషన్?

మతపరమైన రిజర్వేషన్లు ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశమే లేదట. ఈమాటలు అన్నది బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు అసంబద్ధమన్నావు ఓకే. ఇంకా ఏమన్నాడంటే.. మతపరమైన రిజర్వేషన్లు కావాలనుకుంటే టీఆర్ఎస్ ను గెలిపించాలట… వద్దనుకుంటే బీజేపీని గెలిపించాలట.

కిషన్ రెడ్డి.. నువ్వేనా ఈ మాటలు మాట్లాడేది. బుర్ర ఉండే మాట్లాడుతున్నావా? లేక నీ బుర్రను ఎక్కడైనా మరిచిపోయి మాట్లాడుతున్నావా? మతపరమైన రిజర్వేషన్లు ప్రకటించినందుకు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవు సరే. ఒకవేళ రిజర్వేషన్లు ప్రకటించకపోతే అప్పుడు పెట్టుకుంటారా పొత్తు. అంటే మీకంటూ ఓ ఎజెండా ఏం లేదా? కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే బతుకుతారా? తెలంగాణ ప్రజల సంక్షేమం పట్టదా మీకు. ఇదేనా మీ పార్టీ పెద్దలు మీకు నేర్పించింది.

సరే.. అది పక్కన బెడదాం. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న శ్రద్ధ నల్లగొండ ప్రాజెక్టుల మీద లేదట. గత ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టులనే పట్టించుకోలేదు కదా కిషన్ రెడ్డి. అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు. నువ్వెందుకు మాట్లాడలేదు. నువ్వూ నీ చెత్త మాటలు. ఏది ఏమైనా.. సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారు. తెలంగాణ మొత్తం సస్యశామలం అవుతుంది. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ శ్రమిస్తున్నారు. ఒక్క రోజులోనే అంతా జరిగిపోదు కిషన్ రెడ్డి. కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ నాలుగేండ్లలో దేశంలో ఏం మార్పు తీసుకొచ్చింది. ఏం తీసుకురాలేదు. కాని.. సీఎం కేసీఆర్ నాలుగేండ్లలోనే తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు.

Top