You are here
Home > Latest News > మహా కూటమి ఇజ్జత్ తీసేస్తున్న తెలంగాణ జనాలు..

మహా కూటమి ఇజ్జత్ తీసేస్తున్న తెలంగాణ జనాలు..

Spread the love
  • మహా కూటమి ఇజ్జత్ తీసేస్తున్న తెలంగాణ జనాలు..
  • ఓట్లకోసం వస్తున్న మహాకూటమి నేతలతో మూడు చెరువుల నీళ్లు తాపిస్తున్నారు..
  • తెలంగాణ జనాలు అమాయకులనుకుంటున్నారా?
  • తెలంగాణపై చంద్రబాబు, కాంగ్రెస్ వేసిన కేసులు ఏత్తేయాలని డిమాండ్..

తెలంగాణ వ్యతిరేక పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నది.. తెలంగాణను దోచుకుతిన్న పార్టీ కాంగ్రెస్. వీళ్లిద్దరి మధ్య మరో బుడంకాయ కోదండరాం. వీళ్లందరికీ తెలంగాణ అభివృద్ధి చెందడం నచ్చదు. తెలంగాణ అభివృద్ధి చెందితే చూసి ఓర్చుకోలేరు. కానీ.. వీళ్లకు తెలంగాణలో అధికారం మాత్రం కావాలె. అది ఈ మహా కూటమి ప్లాన్. ఆ మహా కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి తెలిసేందే కదా. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్నది. ప్రతి దాంట్లో అడ్డు పుల్ల వేసింది. ప్రతి దానిపై కేసు వేసింది. తెలంగాణకు శనిలా దాపురించింది ఈ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నాయకులను ఎంత తిట్టినా.. సిగ్గూశరాలు మాత్రం రావు వాళ్లకు. వాళ్లు అసలు మనుషులైతే కదా.

ఇక.. జిత్తులమారి నక్క చంద్రబాబు గురించి తెలియనది ఎవరికి. సొంత మామనే వెన్నుపోటు పొడిచినోడు.. తెలంగాణను వదిలిపెడతడా? ఆనాడు తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంట్ సాక్షిగా పోరాడిండు.. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడుతున్నడు.

తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా కోర్టుల్లో కేసులు వేసిండు. తెలంగాణ వచ్చిన వెంటనే తెలంగాణకు చెందిన ఏడు మండలాలను గుంజుకున్నడు బాబు. ఏపీలో కలుపుకున్నడు.

తెలంగాణ ఏర్పాటైన తర్వాత కొన్ని రోజులు విద్యుత్ కొరత ఉంటే.. కరెంటు ఇవ్వకుండా తెలంగాణ చీకటిలో మగ్గేలా చేసిండు ఆ చంద్రబాబు. ఎక్కడ చూసినా చంద్రబాబు అడ్డంకులే.

కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన నీటివాటాపై కూడా బాబు బ్రిజేశ్ ట్రిబ్యునల్ లో తొండివాదన చేస్తున్నాడు.. బేసిన్ లో లేని ప్రాంతాలకు నీళ్లను తరలించుకుపోతున్నాడు.. కానీ.. బేసిన్ లో ఉన్న ప్రాంతాలకు నీళ్లు ఇవ్వొద్దని వితండవాదం చేస్తున్నాడు.

ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తే.. దానిపైనా రాద్ధాంతం చేస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా అనేక కేసులు వేసిన చరిత్ర బాబుది, కాంగ్రెస్ పార్టీది. నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తే దానిపై ఇలా కేసులు వేస్తూ తెలంగాణ రైతన్నకు సాగునీరు అందకుండా చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఏకంగా కేంద్రానికే లేఖ రాశాడు.. అంటే అర్థం చేసుకోవచ్చు.. బాబుకు తెలంగాణపై ఎంత కోపం, ద్వేషం ఉందో?

హైకోర్టు విభజననూ అడ్డుకుంటున్నాడు. తెలంగాణ వచ్చి నాలుగేళ్లు దాటినా హైకోర్టును విభజించనీయకుండా అడ్డుకుంటున్నాడు చెత్తబాబు.

ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ప్రభుత్వంపై, తెలంగాణ అభివృద్ధిపై ఈ బాబు, కాంగ్రెస్ నేతలు, ఆ కోదండరాం.. ఎన్నో కేసులు వేశారు.

ఇలా తెలంగాణకు వ్యతిరేకంగా.. తెలంగాణ అభివృద్ధికి ఆటంకాలు చేస్తూ లెక్కలేనన్ని కేసులు వేస్తున్న ఈ ఆంధ్రా బాబు, కాంగ్రెస్ నాయకులు, కోదండరాంలు ఆ కేసులను వాపస్ తీసుకుంటారా? ఈ కాంగ్రెస్ నేతలకు సిగ్గుందా? అసలు.. తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమించిన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ కోదండరాంకు శరం లేదు. వాడసలు మనిషే కాదు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్న పార్టీలతో పొత్తుపెట్టుకొని ఏం సాధిస్తాడు. వీళ్లంతా తమ తమ స్వార్థం కోసం.. ఒకరితో మరొకరు పొత్తు పెట్టుకున్నవాళ్లే తప్పితే.. ఎవ్వరూ తెలంగాణను ఉద్దరిద్దామని పొత్తు పెట్టుకున్నవాళ్లు కాదు.

అందుకే.. తెలంగాణపై పెట్టిన కేసులను ఈ పార్టీలకు ఎత్తేసే దమ్ముందా? టీడీపీ తెలంగాణపై వేసిన కేసులను వాపస్ తీసుకుంటునే తమ వద్దకు వచ్చి ఓట్లడగాలని తెలంగాణ ప్రజలు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. దీంతో మహాకూటమి నాయకులు కాస్త మొహం కిందేసుకొని అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఏ అభ్యర్థికైనా అదే గతి పడుతుండటంతో ఏం చేయాలో తెలియక.. ఎందుకు పొత్తు పెట్టుకున్నాంరా బాబు.. అంటూ ఒకరికి తెలియకుండా మరొకరు తలలు బాదుకుంటున్నారు.

Top