You are here
Home > Latest News > మాటలు కాదు లక్ష్మణ్ చేతల్లో చూపించు.

మాటలు కాదు లక్ష్మణ్ చేతల్లో చూపించు.

Spread the love
  1. మాటలు కాదు లక్ష్మణ్ చేతల్లో చూపించు.
  2. టీఆర్ఎస్ మెడలు వంచే దమ్ము బీజేపీకే ఉందా?.
  3. అయితే హుజూర్ నగర్ లో డిపాజిట్లు తెచ్చుకుని చూపించు.
  4. కనీసం రెండోస్థానంలో మీ పార్టీ వచ్చినా.. మీరు గెలిచినట్లే?.
  5. ఈ సవాల్ కు సిద్ధమా?. లేక రాజకీయ సన్యాసానికి సిద్ధమా.

బీజేపీ నాయకులు తమకు తాము చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు. అధికార పార్టీ మెడలు వంచాలంటే కేవలం బీజేపీ వల్లే అవుతుందని లక్ష్మణ్ కలలు గంటున్నాడు. అయ్యా లక్ష్మణ్.. టీఆర్ఎస్ మెడలు వంచుడు తర్వాత గానీ.. ముందు నీ ముషీరాబాద్ లో పార్టీ పరిస్థితి ఏంటో తెలుసుకో.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క  కార్పొరేటర్ ను అయినా గెలిపించుకో. ఇప్పటికే పంచాయతీల్లో పట్టులేదు.. పరిషత్ లో స్థానం లేదు. ముక్కుతు మూలుగుతూ ఒకే ఒక్క సభ్యుడుతో అసెంబ్లీలో నెట్టుకొస్తున్నారు. మీరు టీఆర్ఎస్ మెడలు వంచుతారా?. టీఆర్ఎస్ ను టచ్ చేసే దమ్ముందా?.

మిస్టర్ లక్ష్మణ్.. నీ ముత్తాతలు.. వాళ్ల తాతలు దిగొచ్చినా.. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరు. టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోవడం అంటే ఆషామాషీ అనుకుంటున్నావా లక్ష్మణ్. నువ్వు నీ మోడీ వచ్చి హుజూర్ నగర్ లో పొర్లు దండాలు పెట్టినా.. గెలిచేది టీఆర్ఎస్ పార్టీయే. ఇంకో పది రోజులు ఆగితే మీ విర్రవీగుడు అంతా పాతాళానికి చేరుతుంది. ఎందుకంటే.. హుజూర్ నగర్ లో బీజేపీకి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అందుకే రెండో స్థానంలో నిలిచినా.. మీరు గెలిచినట్లే అనే ఛాలెంజ్ చేస్తున్నాం లక్ష్మణ్.

అసలు హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పదుల సంఖ్యలో గ్రామాల్లో ఇప్పటికీ మీ పార్టీ జెండా పట్టే దిక్కే లేదు. ఇంకా ఎలా గెలుస్తాం.. టీఆర్ఎస్ మెడలు వంచుతాం అని ప్రగల్భాలు పలుకుతున్నావ్ లక్ష్మణ్. నీ పనికిమాలిన వేషాలు మీడియా ముందు వేసుకో. కాదని.. కథలు పడితే.. మీ బీజేపీ గురించి కథలు, కథలుగా ప్రజలు చెప్పుకోవాల్సి వస్తుంది. ఏం టీఆర్ఎస్ అంటే ఎలా కనిపిస్తుంది. కేసీఆర్ రంగంలోకి దిగితే.. హుజూర్ నగర్ లో 50వేలకు పైగా మెజార్టీ గ్యారంటీ తెలుసా లక్ష్మణ్. ప్రజలు ఇప్పటికీ గులాబీ జెండానే నమ్ముతున్నారు తప్ప.. ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మడం లేదు. ఈ నెల 24న ఇదే రుజువు కాబోతోంది వెయిట్ అండ్ సీ.

Top