You are here
Home > Latest News > మిషన్ కాకతీయపై విష ప్రచారం.

మిషన్ కాకతీయపై విష ప్రచారం.

Spread the love

 

  • వందలాది చెరువులు కళకళలాడుతుంటే.. కడుపుమండుతోంది.
  • గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం.
  • ఆంధ్రాపాలకుల తొత్తు పత్రిక ఆంధ్రజ్యోతి మిషన్ కాకతీయపై తప్పుడు ప్రచారం.
  • వందల చెరువులు బాగుపడుతుంటే పనులు అంతలా సాగడం లేదంటూ విమర్శలా?.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే 42వేల గొలుసుకట్టు చెరువులు, చిన్నచిన్న కుంటలు సైతం పునరుద్దరించి.. భూగర్బ నీటిమట్టాన్ని పెంచాలని నిర్ణయించి ఏటా పదివేల చెరువులు టార్గెట్ పెట్టుకుని పనిచేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే మూడు విడతల్లో వేల చెరువులు బాగుపడ్డాయి. చెరువుల్లో నీళ్లు నిలవడం, భూగర్భ నీటిమట్టం పెరగడంతో.. కేవలం చెరువుల కిందే దాదాపు 9 లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

చెరువుల పునరుద్ధరణ యజ్ఞంలా జరిగిందని దేశమే కాదు.. ప్రపంచ సంస్థలు కొనియాడుతుంటే.. ఇక్కడి వనరులు అనుభవిస్తూ మీడియా సంస్థలు నడుపుకునే ఆంధ్రజ్యోతి లాంటి విష పత్రికలు మాత్రం తప్పుడు రాతలు రాస్తున్నాయి. మూడో విడత చెరువుల పునరుద్ధరణలో వేగంగా పనులు జరగడం లేదని, బిల్లుల చెల్లింపులో జాప్యమే కారణమని నోటికొచ్చింది రాస్తున్నారు. చెరువుల పునరుద్ధరణ అనేది ఎంతో పారదర్శకంగా చేస్తున్నది ప్రభుత్వం. టెండర్ల దగ్గర నుంచి బిల్లుల చెల్లింపు వరకు అంతా ఆన్ లైన్ లోనే నిర్వహిస్తోంది. ఎంత పని చేస్తే అంతే డబ్బు చెల్లిస్తోంది.

ఎవరైతే పనులు పెండింగ్ పెడతారో వారికే నిధుల విడుదల ఆపడం జరిగింది. పనులు పూర్తి చేస్తే వెంటనే డబ్బు రిలీజ్ చేయడం జరుగుతోంది. అంతేకాని.. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేకో… లేక ఇంకేదో కారణంతో బిల్లుల చెల్లింపు జరగడం లేదనడం అవాస్తవం. కాళేశ్వరం పనులు, రైతుబంధు పథకంలో భాగంగా ఈసారి మిషన్ కాకతీయపై అధికారులు అంతగా శ్రద్ధ పెట్టి ఉండకపోవచ్చు. కానీ.. ఇకపై చెరువుల పూడికతీతపై నజర్ పెట్టి వేగంగా పనులు చేయిస్తుంది ప్రభుత్వం. కొంచెమంతైనా ఓపిక లేకుండా అర్థం పర్థం లేని వార్తలు రాయడం మానుకోండి.

Top