You are here
Home > Latest News > మీకు చేతకాదు.. చేసేటోల్లను తప్పుబడ్తరా?

మీకు చేతకాదు.. చేసేటోల్లను తప్పుబడ్తరా?

Spread the love

 

అవును. ఇది నిజం. మీకు మంచి చేయడం చేతకాదు. కేరళకు పోయి చూస్తె.. మీ మంచి సంగతేందో తెలుస్తది. కమ్యూనిస్టు పార్టీలు అని చెప్పుకునేందుకే కానీ.. ప్రజల ప్రాణాలు రక్షించేందుకు కాదు మీ తీరు. ఇప్పటికే జనాలు అర్థం చేస్కుని.. మిమ్మల్ని.. రాజకీయంగ అడ్రస్ లేకుండ చేసిన్రు. అయినా.. మీకు బుద్ధి వస్తలేదు. అందరినీ దోచుకుతింటున్న కేంద్రానికి.. అన్ని వర్గాలకూ సంక్షేమ ఫలాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మీరు పోలిక ఎలా పెడుతున్నారో అర్థం కావడం లేదు.

 

వరుస పన్నులు.. పెరుగుతున్న ధరలు.. పేద ప్రజల నడ్డి విరుస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం.. అలాంటి పరిస్థితి పేదలకు రానీయకుండా.. జాగ్రత్తలు తీసుకుంటూ.. మహిళలు, వృద్ధులు, వికలాంగులు.. ఒంటరి మహిళలకూ.. సంక్షేమ ఫలాలు అందిస్తూ.. వారిని ప్రగతి బాట పట్టిస్తోంది. అలాంటి టీఆర్ఎస్ కూ.. పనికిమాలిన బీజేపీకి పోలిక పెట్టినప్పుడే.. మీ అవగాహన రాహిత్యం ఎలా ఉందో అర్థమవుతోంది.

 

అసలు.. మీ గురించి మాట్లాడడమే దండగ పని. ఎందుకంటే.. ఎవర్నైతె తిడ్తరో.. మీరు మల్ల వాళ్లతోనే కలుస్తరు. అట్ల.. తెలుగుదేశం పార్టీతోని ఒకసారి.. కాంగ్రెస్ తోని ఒకసారి.. రాజకీయ వ్యభిచారం చేసిన మీరు.. ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నరు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం అట్ల కానే కాదు. కేంద్రంతోని బరాబ్బర్ కొట్లాడ్తది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అన్ని రకాలుగ ప్రయత్నిస్తది. వాళ్లను అవసరమైతే చెడుగుడు ఆడుకుంటది.

 

ఇంకేమంటున్నరు మీరు.. అన్నదాత విలవిలనా? కేంద్రంల అధికారంల ఉన్న బీజేపీ కన్నా.. రాష్ట్రప్రభుత్వమే నయమని చాన మంది జనాలు అంటున్నరు. బీజేపీ అధికారంల ఉన్న రాష్ట్రాలల్ల.. రైతులు ప్రాణాలు విడుస్తంటె.. మన ప్రభుత్వం మాత్రం రుణమాఫీ అమలు చేసి.. వారికి పంట సహాయం ఇచ్చే ఏర్పాట్లు చేసి.. మొత్తం 24 గంటల పాటు.. ఉచిత కరెంటు అందించేలా చేసి.. వ్యవసాయాన్ని పండగలా మారుస్తుంటే.. మీరు ఇలా మాట్లాడ్డం సమంజసమా?

 

ఇంకా చాలా ఉన్నాయ్. వైద్యం లేదన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం గతం కంటే మెరుగైంది. విద్య అందడం లేదన్నరు. ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం కొట్లాడుతున్న పిల్లలను చూడండి. ఆడవాళ్లపై దాడులన్నారు. షీ టీమ్స్ తో దేశంలోనే కొత్త ఒరవడి సృష్టించింది కేసీఆర్ ప్రభుత్వం అని మరవకండి. ఉపాధి లేమి అన్నరు. వరుస నోటిఫికేషన్లు ఇస్తుంటె.. వాటిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ కు చేతనైతే బుద్ధి చెప్పండి.

 

నామమాత్రపు కేటాయింపులంటున్నరు. సంక్షేమానికే 35 వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించే ప్రభుత్వం దేశంలో ఇంకేదన్నా ఉందేమో చూపండి. ధరల పెరుగుదల అంటున్నరు. రైతుబజార్లలో ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు చూసి మాట్లాడండి.  ఇలా చెఉతూ పోతే.. మీరు మాట్లాడిన అన్ని కామెంట్లకూ.. సమాధానాలు ఉన్నాయి. ఇవన్నీ విన్నాక.. చదివినాక మీరు మొహం ఎక్కడ పెట్టుకోవాలా అని ఆలోచించకండి. ఇప్పటికైనా.. ఇలాంటి పనికిమాలిన ప్రచారాలు ఆపండి. అది చాలు.

 

 

Top