You are here
Home > Latest News > మీపై ఏం కేసు పెట్టారు అరుణమ్మా? అంత గింజుకుంటున్నారు?

మీపై ఏం కేసు పెట్టారు అరుణమ్మా? అంత గింజుకుంటున్నారు?

Spread the love

 

  • తప్పు చేశాడు కాబట్టే రేవంత్ రెడ్డిపై కేసులు, సోదాలు
  • తప్పు తేలింది కాబట్టే జగ్గారెడ్డికి గతి అయిన జైలు ఊచలు
  • ఏ పార్టీ అయినా, ఏ నేత అయినా.. తప్పు చేస్తే అదే గతి

మాజీ మంత్రి డీకే అరుణ.. అనవసరంగా గొంతు చించుకుంటున్నారు. రాజకీయ వ్యభిచారి అయిన రేవంత్ రెడ్డి గురించి అనవసరంగా తన నోరు పారేసుకుంటూ ప్రజల్లో ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు. ఓటుకు నోటు కేసులో అంత నేరుగా మీడియాకు పట్టుబడిన రేవంత్ ను వెనకేసుకొస్తూ చరిత్రాత్మకమైన తప్పు చేస్తున్నారు అరుణమ్మ. ఎందుకమ్మా మీకీ గతి అని కార్యకర్తలు బాధపడేంతగా ఆమె వ్యవహరిస్తున్నారు.

పోలీసులు సోదాలు చేసినంత మాత్రాన… కేసులు పెట్టినంత మాత్రాన… అదో నేరమన్నట్టు, అదో ఘోరమన్నట్టు మాట్లాడుతున్నారే. రేవంత్ పై వచ్చిన ఆర్థిక అక్రమాల ఆరోపణల గురించి ఎందుకు స్పందించరు? వాటి విషయంలో చట్టానికి అనుగుణంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారే తప్ప… ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఎంత మాత్రం లేదన్న విషయాన్ని ఎందుకు గ్రహించరు?

ఒకప్పుడు టీడీపీలో రాజకీయ వ్యభిచారం చేసిన రేవంత్ రెడ్డి గురించి మీ పార్టీ నేతలు ఏం మాట్లాడారో గుర్తు చేసుకోమ్మా అరుణమ్మా? ఇప్పుడు మీ గూటికి చేరాడు కాబట్టి ఆ మైలను కాంగ్రెస్ పార్టీ కూడా అంటించుకుందో ఏమో తెలియదు కానీ.. జనం మాత్రం ఎప్పుడూ రేవంత్ రెడ్డి లాంటి దుర్మార్గుడి రాజకీయాలను స్వాగతించరు కాక స్వాగతించరు. మీకు అవసరం కాబట్టి… టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు నోరున్న దగుల్బాజీలు కావాలి కాబట్టి కాంగ్రెస్ లో చేర్చుకున్నారో ఏమో కానీ… మీ అవకాశవాదాన్ని పట్టించుకోవాల్సిన అవసరం జనానికి లేదు.

అందుకే… పోలీసులు రేవంత్ రెడ్డి ఆస్తులపై సోదాలు చేస్తుంటే… ఇది మామూలు విషయంగానే జనాలు పరిగణిస్తున్నారు అరుణమ్మా. అర్థం చేసుకోండి. ఇప్పటికైనా రేవంత్ ను వెనకేసుకురావడం మాని… మీ పరువునైనా కాపాడుకోండి. పేర్లు వెల్లడించేందుకు ఇష్టపడని మీ కార్యకర్తలు కూడా ఇదే మాట అంటున్నారు. తెలుసుకోండి. వారి ఆకాంక్షలకు అనుగుణంగా మసులుకోండి. లేదంటే… రాజకీయాల నుంచి వైదొలగండి.

Top