You are here
Home > Latest News > మీరంతా సత్యహరిశ్చంద్రులు కదా మరి..

మీరంతా సత్యహరిశ్చంద్రులు కదా మరి..

Spread the love

 

  • టీఆర్ఎస్ పార్టీ పైన అబద్ధాలు ప్రచారం చేసినప్పుడు ఎక్కడ పోయింది మీకు ఈ తెలివి..
  • వర్ల రామయ్య గురించి ఏపీ ప్రజలకు తెల్వదా?
  • ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎవరి తొత్తో వాళ్లకు తెలియదా?

వీళ్లంతా సత్యహరిశ్చంద్రులట. వీళ్లపై అభాండాలు వేస్తున్నారట. ఆహా.. ఏం మాట్లాడుతుంటిరి.. అసలు.. మీ అంత మంచోళ్లు ఈ భూమ్మీదనే లేరన్నట్టుగా మాట్లాడుతున్నాడు వర్ల రామయ్య. ఏపీఎస్సార్టీసీ చైర్మన్ అట ఆయన. ఆయన, ఏబీఎన్ చానెల్ వచ్చినట్టు.. చంద్రబాబు ఏదో అన్నట్టు సోషల్ మీడియాలో వచ్చిన ఓ క్లిప్పింగ్ ను పట్టుకొని తెగ హల్ చల్ చేస్తున్నాడు. వారి దేవుడోయ్.. ఏపీలో ఉన్న అసలు సమస్యలను పట్టించుకోరు వీళ్లు. ఏదో సోషల్ మీడియాలో వచ్చిన ఒక్క ఫోటోను పట్టుకొని రచ్చరచ్చ చేస్తున్నారు. ఏబీఎన్ చానెల్ లో ఏపీ సీఎం కులం గురించి ఏదో అన్నట్టుగా వచ్చిందని.. దాన్ని అసలు ఏబీఎన్ ప్రసారం చేయలేదట. దీంతో వర్ల రామయ్య రెచ్చిపోయాడు. ఏపీ సీఎంపై ఇలా బురద జల్లడమేంది అంటూ పిచ్చి కూతలు కూస్తున్నాడు. అవును.. వర్ల రామయ్యా.. మీదంతా ఒకే గ్రూప్ కదా. అంటే చంద్రబాబు, ఆంధ్రజ్యోతి, వర్ల రామయ్య.. మీరంతా ఒక్కటే బ్యాచ్ కదా. అందుకే అంత ఆయాస పడుతున్నావా? మీరేమన్నా శుద్ధపూసలా? మీరు శుధ్దపూసలైనట్టుగా మాట్లాడుతున్నావు.

పొద్దున లేస్తే టీఆర్ఎస్ పార్టీ మీద ఎన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు మీరు. దానికి ఏమనాలి మిమ్మల్ని. అప్పుడు సిగ్గు లేదా మీకు. టీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాలు చేస్తే ఏం లేదు కానీ.. ఎవరో ఆకతాయి చేసిన పనికి రచ్చ రచ్చ చేస్తున్నారు. వీలైతే ఏపీలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టండి.. ఇటువంటి పనికిమాలిన విషయాలపై కాదు. వీటి వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. టీఆర్ఎస్ పార్టీ పైన, సీఎం కేసీఆర్ పైన ఆంధ్రజ్యోతి అబద్ధాలు రాసినప్పుడు… సీఎం కేసీఆర్ ఫై ఆంధ్రజ్యోతి ఆర్కే పిచ్చి పలుకులు పలికినప్పుడు.. అప్పుడు గుర్తుకు రాలేదా మీకు ఇవన్నీ. మీకు నొప్పి తగిలితే మాత్రం అమ్మా.. అని అరుస్తారు. వేరేవాళ్లకు తగిలితే.. వాళ్లను నొప్పి పుట్టదా? మీకే నొప్పి పుడుతదా? ఆర్కే వాగే పిచ్చి ముందు ఇదెంత. అసలు.. దీనిపై నువ్వు ఇంత రచ్చ చేస్తున్నావంటే.. ఇదంతా చంద్రబాబు మైండ్ గేమ్ అని అర్థమవుతూనే ఉన్నది. ఏపీ ప్రజల సంక్షేమం కోసం ఏనాడైనా ఇలా మాట్లాడావా నువ్వు వర్ల రామయ్య. కులాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు మచిలీపట్నం బస్టాండ్ లో కులాన్ని ఆపాదిస్తూ చేసిన వ్యాఖ్యలు ఎవరికి గుర్తు లేవు. మీరు శుద్ధపూసలు కానీ.. మిగితా వాళ్లే మంచోళ్లు కాదు అన్నట్టుగా ఉన్నాయి మీ మాటలు.

Top