You are here
Home > Latest News > మీరు విద్యార్థులకు భరోసా ఇస్తారా విజయశాంతి?

మీరు విద్యార్థులకు భరోసా ఇస్తారా విజయశాంతి?

Spread the love
  • మీరు విద్యార్థులకు భరోసా ఇస్తారా విజయశాంతి?
  • ఓసారి నీ ముఖం అద్దంలో చూసుకో..
  • తెలంగాణ సమస్యలపై నువ్వు ఏనాడైనా పట్టించుకున్నావా?
  • తెలంగాణలో ఎన్నికలంటేనే కనిపిస్తావు.. లేదంటే మాయమవుతావు.. నిన్నెట్టా తెలంగాణ ప్రజలు నమ్మేది…

విజయశాంతి.. ఈమె ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థం కాదు. సినీ గ్లామర్ ను ఓట్లుగా మలుచుకొని విజయశాంతి ద్వారా ఓట్లు రాబట్టాలనుకున్నారు కాంగ్రెస్ నేతలు. కానీ.. మొన్నటి అసెంబ్లీలో అది బెడిసికొట్టింది. ఆమె ప్రచారం వల్ల కాంగ్రెస్ నయా పైసా ఫైదా లేదు. పైపెచ్చుకు నష్టం జరిగిందని చెప్పుకుంటున్నారు. అసలు.. విజయశాంతి తెలంగాణకు చేసిందేంటి చెప్పండి. ఆమె చేసిన పని ఏమన్నా ఉందా? ఏం లేదు. తెలంగాణ సమస్యలపై ఏనాడైనా ఆమె గళమెత్తిందా అంటే అదీ లేదు. తెలంగాణ వచ్చాక జాడ లేకుండా పోయింది. మళ్లీ 2018 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణలో ప్రత్యక్షమైంది. అప్పటి వరకు విజయశాంతికి తెలంగాణ గుర్తుకు రాలే? తెలంగాణ విద్యార్థులు గుర్తుకు రాలే.. కానీ… ఇప్పుడు సడెన్ గా తెలంగాణ విద్యార్థులు గుర్తుకొచ్చారు. వాళ్లకు ఈమె భరోసా ఇస్తదట.

తెలంగాణ విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా పట్టించుకున్నదా? ఇప్పుడు కూడా ఓవైపు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటుంటే మీరు మాత్రం నిరసనలు, ధర్నాలు అంటూ ఊర్లు పట్టుకొని తిరుగుతున్నారు. మీరు విద్యార్థులకు భరోసా ఇస్తున్నారా? 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన అక్రమాలు ఎన్నో. విద్యార్థులను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టించింది. ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రతి డిపార్ట్ మెంట్ లోనూ అవినీతిని ఆజ్యం పోసింది. ఇప్పుడు కాంగ్రెస్ నేతలంతా శుద్ధపూసయ్యారా? చేసిందంతా చేశారు. ఏం చక్కా తెలంగాణను ఆసాంతం నాకేశారు. కడుపు నింపుకున్నారు. ఇప్పుడు ఏం నటిస్తున్నారు. ధర్నాలు, నిరసనలు అంటూ తెలంగాణ ప్రజల నుంచి సానుభూతి పొందాలనుకుంటున్నారా? అసలు మీ ఉద్దేశం ఏంది. తెలంగాణలో అలజడులు సృష్టించాలనుకుంటున్నారా విజయశాంతి. ఎందుకు ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నావు. కనీసం ఇప్పుడైనా తెలంగాణను ప్రశాంతంగా ఉండనీయవా? మీ అబద్ధపు ప్రచారాలను ఇక ఆపరా? మీరు మారరా? ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూడటం అలవాటు అయింది మీకు. ఇంకెప్పుడు మారుతరు మీరు. ఇంకెప్పుడు తెలంగాణ సంక్షేమం కోసం పాటుపడుతరు. ఇప్పటికీ.. ఇంకా అధికార వ్యామోహంతో తెలంగాణపై పడి పీక్కుతిందామని ఆలోచిస్తున్నారు మీరు. అందుకే కదా.. తెలంగాణ ప్రజలు ఎన్నిసార్లు ఓడించినా ఇంకా పోటీ చేస్తూనే ఉన్నారు.

Top