You are here
Home > Latest News > మీరూ.. మీ దిక్కుమాలిన లక్ష్యాలు.. అధికారం లేకపోయే సరికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నరు.

మీరూ.. మీ దిక్కుమాలిన లక్ష్యాలు.. అధికారం లేకపోయే సరికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నరు.

Spread the love

 

  • తెలంగాణకు ఏదైనా చేద్దామని లేదు..
  • ఎంతసేపు టీఆర్ఎస్ ను గద్దె దించడం అనేది గొప్ప లక్ష్యమా కాంగ్రెస్ లీడర్స్
  • దశాబ్దాలు పరిపాలించిన మీ పార్టీ తెలంగాణకు చేసిందేమైనా ఉందా?

తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పిచ్చి పీక్ స్టేజ్ లోకి వచ్చేసింది. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ వాళ్ల పిచ్చి కూడా ముదిరి ముదిరి పాకానికొస్తున్నది. మైకు దొరికితే చాలు.. టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యం.. కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యం. ఏంది.. ఈ దిక్కు మాలిన లక్ష్యాలు. చేతనైతే తెలంగాణకు ఏదైనా చేస్తామని చెప్పండి. తెలంగాణను బాగు చేస్తామని చెప్పండి. తెలంగాణ రైతన్నను ఆదుకుంటామని చెప్పండి. కాని.. కేసీఆర్ ను కాని.. టీఆర్ఎస్ ను కాని గద్దె దించితే తెలంగాణ ప్రజలకు వచ్చే లాభం ఏమీ లేదు. ఆ లాభం మీకే. అందుకే గద్దె దించుతాం.. అంటూ అరుస్తున్నారు.

తెలంగాణ ప్రజలకు కోసం అది చేస్తాం ఇది చేస్తాం అని ఏనాడైనా చెప్పారా మీరు. లేదు. ఎంతసేపు అధికారం కోసం అర్రులు చాపారే తప్ప.. తెలంగాణ ప్రజల కోసం మాత్రం కాదు. అందుకే మీ పార్టీని తెలంగాణ ప్రజలు ఏనాడో తిరస్కరించారు. అయినా.. సిగ్గు లేకుండా మళ్లీ అధికారం కోసం ఎగబడుతున్నారు. అసలు.. మీకు ఏ మాత్రం సిగ్గు శరం ఉన్నా మిమ్మల్ని కాదన్న వాళ్ల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగరు.

కాని.. మీకు అవేమీ లేవు కదా.. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై, మంత్రి కేటీఆర్ పై బట్ట కాల్చి మీదేసి తెలంగాణ ప్రజలను ఓట్లు అడుక్కుంటున్నరు. మీరూ మీ జాతి. దశాబ్దాలు పరిపాలించిన మీ పార్టీ తెలంగాణను ఆదుకున్న పాపాన పోలేదు. తెలంగాణ రైతన్న వెక్కి వెక్కి ఏడ్చిండు. అన్నం పెట్టే రైతన్నను ఏడిపించారు మీరు. రైతన్న ఉసురు మీకు తాకకుండా ఉండదు. తెలంగాణ అభివృద్ధికి ఆమడ దూరంలో పడేశారు. ఎక్కడో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తెలంగాణను కేవలం నాలుగేండ్లలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారు. తెలంగాణ బాగుపడటం మీకు ఇష్టం లేదు కదా. అందుకే తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఈసారి మిమ్మల్ని ఓడించడం మాత్రమే కాదు.. తెలంగాణ నుంచే లేకుండా తరిమి తరిమి కొట్టడానికి తెలంగాణ ప్రజలంతా రెడీగా ఉన్నరు.

Top