You are here
Home > Latest News > మీ పార్టీలోనే బీసీలను పట్టించుకోవట్లేదు.. ఇక రాష్ట్రంలోని బీసీలకు మీరు ఆదుకుంటారా ఉత్తమ్ కుమారా?

మీ పార్టీలోనే బీసీలను పట్టించుకోవట్లేదు.. ఇక రాష్ట్రంలోని బీసీలకు మీరు ఆదుకుంటారా ఉత్తమ్ కుమారా?

Spread the love

 

  • దశాబ్దాలు రాష్ట్రాన్ని పరిపాలించిన మీ పార్టీ ఎందుకు బీసీలను పట్టించుకోలేదు?
  • ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నరు కాంగ్రెస్ నాయకులు..
  • బీసీలకు అన్ని విధాలుగా న్యాయం చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది..

ఉత్తమ్ కుమారా.. మళ్లీ మొదలు పెట్టావా? అసలు నీ ఉద్దేశం ఏంది? నువ్వు ఏం మాట్లాడుతున్నావో? ఎందుకు మాట్లాడుతున్నావో? అసలు నీకైనా అర్థమవుతున్నదా? మాట్లాడిందే మాట్లాడుతవు. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతవు. అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే.. మీ కాంగ్రెస్ పార్టీలోనే బీసీలకు ఎంత అన్యాయం జరుగుతున్నదో ప్రత్యక్షంగా చూసిన దానం నాగేందరే పూసగుచ్చినట్లు చెప్పారు. మీ పార్టీలో నడిచే అంతర్గత కుమ్ములాలు, పదవి కోసం కొట్టుకోవడం, వర్గాలుగా విడిపోవడం.. ఇవన్ని మీ పార్టీలో జరుగుతున్నాయి. మరి.. పార్టీని, పార్టీ నాయకులనే సరిగ్గా మేనేజ్ చేయలేని మీరు.. అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని పాలిస్తారా? బీసీలను ఆదుకుంటారా? తెలంగాణను అభివృద్ధి చేస్తారా? మీకు ఇంకా ఓట్లేసి గెలిపించడానికి తెలంగాణ ప్రజలేమీ అమాయకులు కాదు.

దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పరిపాలించిన మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీసీలను ఆదుకోలేకపోయింది ఉత్తమ్. అప్పుడెందుకు బీసీలకు రిజర్వేషన్లు పెంచలేదు. మీ హయాంలో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లు ఎంత కేవలం 25 శాతం. మరి.. మీరు ఎందుకు రిజర్వేషన్లను పెంచలేదు. నిజంగా మీకు బీసీలంటే ప్రేమ ఉంటే ఎప్పుడో వాళ్లకు రిజర్వేషన్లు పెంచేవారు. కాని.. అసలు వాళ్ల గురించి ఏనాడైనా మీరు పట్టించుకుంటే కదా. కాని.. సీఎం కేసీఆర్ బీసీల రిజర్వేషన్లను పెంచేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం బీసీ కమిషన్ ను ఏర్పాటు చేసి వాళ్లపై అధ్యయనం చేసి 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నది సీఎం కేసీఆర్ ప్రభుత్వం. స్థానిక ఎన్నికల్లోనూ బీసీలకు 34 శాతం కన్నా తగ్గకుండా రిజర్వేషన్లు అమలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో శ్రమిస్తుంటే నువ్వేమో కాకమ్మ లెక్కలు చెబుతూ విమర్శిస్తుంటివి. నువ్వు చేయవయితివి.. చేసే వాళ్లను చేయనిస్తలేవయితివి.

నీకు, నీ పార్టీకి చిత్తశుద్ధి లేదు కాబట్టే బీసీలకు పట్టించుకోలేదు. పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం కన్నా రిజర్వేషన్లు మించరాదని హైకోర్టు తీర్పు చెప్పినా.. తెలంగాణలోని వెనుకబడిన కులాల సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని సుప్రీం కోర్టుకు వెళ్లడానికి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. గత పంచాయతీ ఎన్నికలప్పుడు 61 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించింది. 50 శాతం రిజర్వేషన్లు కేవలం విద్య, ఉద్యోగాల్లాంటి వాటికి మాత్రమే వర్తిస్తాయి కాని రాజకీయాలకు సంబంధం ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే సుప్రీం తీర్పు చెప్పింది.

తమిళనాడు ప్రభుత్వం అణగారిన వర్గాల కోసం విద్య, ఉద్యోగాల్లో 69 శాతం రిజర్వేషన్లు చేసుకున్నది. అందుకే తెలంగాణకు కూడా అలాగే అనుమతించాలని అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిన విషయం మరిచిపోయావా? తమిళనాడు తరహాలో మనకు కూడా రిజర్వేషన్లు అమలు అయితే తెలంగాణ ప్రజలకు ఎక్కువ ఫలాలు అందుతాయి కదా. అందుకే తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంటే నువ్వేమో మధ్యల పుల్లలు పెడుతుంటివి. కేంద్రం దగ్గర ఆ ఫైల్ పెండింగ్ ఉంది. మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడూ బీసీలకు ఏం చేయలేదు.. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడూ బీసీలకు ఏం చేయలేదు. ఇప్పుడేమో మీరంతా శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నరు. ఇకనైనా మారండి సన్నాసుల్లారా?

 

 

 

 

Top