You are here
Home > Latest News > మీ మొహానికి 40 ఏళ్ల పాలనలో లక్ష ఉద్యోగాలు ఇచ్చారా?

మీ మొహానికి 40 ఏళ్ల పాలనలో లక్ష ఉద్యోగాలు ఇచ్చారా?

Spread the love
  • మీది ప్రజా కూటమి కాదు.. ప్రజలను పీక్కుతినే కూటమి ఉత్తమ్..
  • నిరుద్యోగులను గాలికొదిలేసిందే కాంగ్రెస్ పార్టీ..
  • తెలంగాణను దోచుకుతిన్న మీకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదు..

అది మహాకూటమి కాదు.. ప్రజా కూటమి అంత కన్నా కాదు.. ప్రజలకు పీక్కుతినే కూటమి. ప్రజలను మట్టుబెట్టే కూటమి.. ప్రజలను మభ్యపెట్టే కూటమి.. ప్రజలను మోసంచేసే కూటమి.. ప్రజలను వంచించే కూటమి.. ప్రజలను నాశనం చేసే కూటమి. ఆ కూటమి గురించా మీరు మాట్లాడేది. సిగ్గుండాలి ఉత్తమ్ నీకు.. సిగ్గుండాలి. తెలంగాణ అభివృద్ది కోసమా నువ్వు కూటమిని ఏర్పాటు చేసింది. తెలంగాణ బాగు కోసమా నువ్వు కూటమిని ఏర్పాటు చేసింది. తెలంగాణ సంక్షేమం కోసం నువ్వు కూటమిని ఏర్పాటు చేసింది.. కాదు.. నువ్వు కూటమిని ఏర్పాటు చేసింది.. తెలంగాణను దోచుకుతినడానికి.. తెలంగాణను నాశనం చేయడానికి.. తెలంగాణలో ఎన్నికలు అనేసరికి ఎగేసుకుంటూ కూటమిని ఏర్పాటు చేసిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారనుకుంటున్నావు ఉత్తమ్.

నువ్వూ నీ మ్యానిఫెస్టో.. ఆపరా బాబు. తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు ఇస్తారా? నోటికి ఏదొస్తే ఆ హామీని ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ పాలించిన 40 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలను ఇచ్చింది. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేవు ఉత్తమ్. 40 ఏళ్లలో నిరుద్యోగులను పట్టించుకోకుండా గాలికి వదిలేసిన మీరా ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడేది. సిగ్గుండాలి ఉత్తమ్. నాలుగున్నరేళ్ల కాలంలో తెలంగాణను ఏనాడూ పట్టించుకోని మీరు ఎన్నికలనేసరికి తెలంగాణపై తెగ ప్రేమ కనబరుస్తున్నారు. అది కపట ప్రేమ అని తెలంగాణ ప్రజలను తెలుసు. మీవి బూటకపు హామీలని కూడా తెలుసు. మీవి అమలు చేసే హామీలైతే.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వాటిని ఎప్పుడో అమలు చేసేవారు. కానీ.. మీకంత సీను లేను. కాంగ్రెస్ పాలిత ప్రాంతాలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు కానీ.. ఇప్పుడు తెలంగాణను అభివృద్ధి చేస్తారట వీళ్లు. మీ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మాలి. మీకు తెలంగాణ ప్రజలు అంత అమాయకుల్లా కనిపిస్తున్నారా ఉత్తమ్. తన్ను తంతే పోయి మూసినదిలో పడాలి నువ్వు, నీ కూటమి జాగ్రత్త.

Top