You are here
Home > Latest News > మీ స్వార్థం కోసం ప్రజలను బలి చేస్తారా?

మీ స్వార్థం కోసం ప్రజలను బలి చేస్తారా?

Spread the love

 

  • ప్రతిపక్షాల మాట విని ప్రజలను ఇబ్బందలకు గురిచేయడమేనా
  • మీ సమ్మె అశ్వత్థామరెడ్డి
  • మీ స్వార్థం కోసం ప్రజలను బలి చేస్తారా?
  • ఇదేనా మీ సిద్ధాంతం
  • గొంతెమ్మ కోరికలు కోరి… అవి నెరవేర్చేదాకా సమ్మె ఆగదు అంటే ఏంటి అర్థం
  • అన్నీ మీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటే సంస్థ ఎందుకు ఇక

అశ్వత్థామరెడ్డి.. నీ స్వార్థం కోసం తెలంగాణ ప్రజలను బలి చేస్తున్నావు. నీ స్వార్థం కోసం ఆర్టీసీ కార్మికులను కూడా బలి చేస్తున్నావు. ఎవరి ప్రోద్బలంతో ఇదంతా చేస్తున్నావో తెలియదు కానీ… అంతిమంగా నష్టపోయేది ఎవరో నీకు తెలియదా? అంతిమంగా ఆర్టీసీ కార్మికులు నష్టపోతారని తెలిసి కూడా నువ్వు ఇలా చేస్తున్నావంటే నిన్ను ఏమనాలి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సమ్మె ఆపను అంటున్నావు.. నీకు ఏం ఇబ్బందులు ఎదురయ్యాయి… ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి.. వాళ్లతో ఇలా సమ్మె చేయిస్తూ మీరు సాధించేదేంటి. అల్టిమేట్ గా నష్టపోయేది మీరే. ప్రభుత్వం ఆదేశాలను, సంస్థ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పండుగ పూట ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ మీరు సాధించేదేంటి చెప్పు అశ్వత్థామరెడ్డి.

సమ్మె చేయడమే కాదు.. తెలంగాణ బంద్ అంటారు. తెలంగాణ బంద్ వల్ల మీకు ఒరిగేదేంటి. మళ్లీ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే కదా. అంటే మీ స్వార్థం కోసం ఏదైనా చేస్తారు. తెలంగాణలో అల్లర్లు సృష్టించడానికి కూడా మీరు సిద్ధమయ్యారు. ఇటువంటి వాళ్లను ఏం చేయాలో తెలంగాణ ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారు మీరు. తెలంగాణ ప్రజలను ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. అది కూడా కేవలం మీ స్వార్థం కోసం. ప్రభుత్వం మీ సమస్యలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నా కూడా ప్రభుత్వం మాటను బేఖాతరు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని పట్టించుకోవడం లేదు. సమ్మె సమ్మె అంటున్నారు. ఏం సాధిస్తారు సమ్మె చేసి. ఏముండదు.

మొండి వైఖరి ఎవరిదో తెలంగాణ ప్రజలకు కూడా బాగానే అర్థం అవుతూనే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడాలంటూ పిచ్చి కూతలు కూస్తున్నారు. ప్రభుత్వం కాదు.. మొండి వైఖరితో ఉన్నది.. మీరు, మీ ప్రభుత్వం మొండి వైఖరితో ఉన్నది. రాష్ట్రం ఇప్పటికే కాదు.. ఎప్పటికీ ఆర్టీసీ కార్మికుల బాగు కోరుకుంటుంది. కానీ.. నువ్వు మాత్రం నీ స్వార్థం కోసం తెలంగాణ ప్రజలతో పాటు ఆర్టీసీ కార్మికులను కూడా బలి పెడుతున్నావు. సమ్మె వల్ల ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. మళ్లీ తెలంగాణ బంద్ చేయడం దేనికి నిదర్శనం. ఇలా తెలంగాణ బంద్ లు చేస్తూ.. సమ్మెలు చేస్తూ తెలంగాణలో లేనిపోని అలజడులు సృష్టిస్తే మీకు వచ్చేదేమీ ఉండదు అశ్వత్థామరెడ్డి.

Top