You are here
Home > Latest News > ముందు నీ సంగతి చూసుకోవోయ్ పొన్నం ప్రభాకరు…

ముందు నీ సంగతి చూసుకోవోయ్ పొన్నం ప్రభాకరు…

Spread the love
  • కారుకు రిపేరు వస్తే బాగు చేసుకునే సత్తా టీఆర్ఎస్ పార్టీకి ఉంది..
  • కాంగ్రెస్ కు రిపేర్ వస్తే.. దాన్ని ఇంకా ఖరాబు చేసే వాళ్లే కాని.. బాగు చేసేవాడు ఒక్కడూ లేడు..
  • 40 ఏళ్లు తెలంగాణను దోచుకుతిని మీరు ఒరగబెట్టిందేముంది..

కారుకు రిపేరు వస్తే నీకేంది బాధ పొన్నం ప్రభాకర్. నీది నువ్వు చూసుకో ముందు. నువ్వు అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డంగా ఓడిపోయావు కదా. ముందు నీది చూసుకో. సిగ్గుందా నీకు పొన్నం. నువ్వు సక్కనోడివైతే నిన్ను తెలంగాణ ప్రజలు ఎందుకు ఓడించారు. ముందు నిన్ను నువ్వు రిపేర్ చేసుకో. నిన్ను నువ్వు రిపేర్ చేసుకునే చేతగాట్లేదు కానీ.. వేరే వాళ్ల గురించి మాట్లాడుతున్నావా? సిగ్గుందా నీకు పొన్నం. ఓడిపోయినా బుద్ధి రావట్లేదా నీకు సన్నాసి. పొన్నం ప్రభాకర్ నీకు దమ్ముంటే నువ్వు గెలిపించి చూపించే వాడివి. కానీ.. కేవలం నువ్వు కూడా మాటలకే తప్పించి ఇంకా దేనికీ పనికిరావని అర్థమయిపోతుంది.

40 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో మీరు తెలంగాణను అడ్డంగా దోచుకున్నారు. ఇప్పుడు శుద్ధపూసల్లెక్క మాట్లాడుతున్నారా మీరు. థూ.. మీ బతుకులు చెడ. మీరు మనుషులు కాదురా. తెలంగాణను దోచుకుతిన్నది చాలదా మీకు. అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ఘోరంగా ఓడించినా.. ఇంకా పంచాయతీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల్లో గెలుస్తామనుకుంటున్నారా? గెలిచి మళ్లీ దోచుకుంటారా? మైకుల ముందు ఏదో ఒకటి లొడ లొడా వాగేముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి ఓసారి. అసలు.. తెలంగాణకు మీరు ఏం ఒరగబెట్టారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వాళ్ల లబ్ధి పొందింది ఎంత? తెలంగాణ సంక్షేమం గురించి కాంగ్రెస్ ఏపాటి ఆలోచించిందని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటేయాలి పొన్నం. ఎన్నికలు రాగానే ప్రజలు గుర్తుకొస్తరు మీకు. ఎన్నికలు అయిపోగానే ఎవ్వరూ గుర్తుకురారు. అప్పుడు మీకు దోచుకోవడమే కనిపిస్తుంది. ఎవ్వరూ కనిపించరు. వానాకాలంలో ఊసిళ్లు వచ్చి పోయినట్టు వచ్చిపోయే మీలాంటి మోసగాళ్లను ఇక తెలంగాణ ప్రజలు నమ్మరు. జన్మలో నమ్మరు. అందుకే మీరు ఎన్ని జన్మలెత్తినా ఇక తెలంగాణలో అధికారంలోకి రాలేరు. అది మీకు పగటికలే.

Top