You are here
Home > Latest News > ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారతరత్న!

ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారతరత్న!

Spread the love

సంక్షేమానికి మారుపేరుగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు.. పేద ప్రజలు నీరాజనం పడుతున్నారు. కార్మిక, కర్షక వర్గాలు.. ముఖ్యమంత్రి పాలన తీరును వేనోళ్ల కొనియాడుతున్నాయి. మూడున్నరేళ్ల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు.. మెరుగైన శాంతిభద్రతలు తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ప్రజలు అంటున్నారు.

ఈ విషయంలో.. రాష్ట్ర ఆటో డ్రైవర్ల జేఏసీ ఓ అడుగు ముందుకు వేసి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తోంది. కేసీఆర్ అమలు చేస్తున్న జనరంజక పథకాలు.. గతంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకురాలేకపోయిదని జేఏసీ నేతలన్నారు. ముందుచూపుతో వ్యవహరిస్తున్న కేసీఆర్.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం.. ప్రజల అదృష్టమన్నారు.

అందుకే.. ముఖ్యమంత్రికి ఈ నెల 25న రవీంద్రభారతిలో సన్మానం చేసి.. శాంతిదూత అవార్డు కూడా అందించనున్నామని జేఏసీ నాయకులన్నారు. కేసీఆర్ కు భారతరత్న డిమాండ్ ను కూడా.. అదే వేదికపై వినిపిస్తామని చెప్పారు. దీంతో.. ప్రజలు కూడా.. ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నారు. తమకు ఇంతగా సంక్షేమాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప.. ఇంకెవరు ఉన్నారని జనం అంటున్నారు.

కేసీఆర్ చేసిన సేవలకు భారతరత్నే సరైన పురస్కారమని.. ఆ అవార్డు ఇస్తే.. దేశ వ్యాప్తంగా కేసీఆర్ చేసిన సేవలకు మరింత ప్రాచుర్యం దక్కుతుందని.. మిగతా రాష్ట్రాల్లో పాలకులకు అది ఆదర్శప్రాయంగా నిలుస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Top