You are here
Home > Latest News > రాజకీయ మార్పు అవసరం.. అది కేసీఆర్ సారథ్యంలో తథ్యం!

రాజకీయ మార్పు అవసరం.. అది కేసీఆర్ సారథ్యంలో తథ్యం!

Spread the love

అవును. ఇది అక్షర సత్యం. ఇన్నాళ్లూ.. దేశ ప్రజలను అయోమయంలో నెట్టేసిన కాంగ్రెస్, బీజేపీ పాలకులకు.. చరమ గీతం పాడాల్సిన సమయం వచ్చింది. ఏకంగా 64 ఏళ్ల పాటు.. దేశాన్ని పట్టుకుని పాలించిన ఆ రెండు పార్టీలు ఇప్పటివరకూ ఏం చేశాయి? ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టు పథకాల పేర్లు మార్చుకుంటూ.. ఏటా కొద్ది కొద్దిగా బడ్జెట్ కేటాయింపులు పెంచుకుంటూ ప్రజలను మభ్య పెడుతూ.. తప్పుడు లెక్కలు చెబుతూ మాయా రాజకీయాలు చేశాయి.

ఇది సహించలేకే.. 2014లో దేశ వ్యాప్తంగా ప్రజలు బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. హంగ్ ఫలితాలు కూడా ఇవ్వకుండా.. దేశంలో మార్పును కోరుకుంటున్న విషయాన్ని స్పష్టంగా తేటతెల్లం చేశారు. కానీ.. బీజేపీ నేతలు.. ముఖ్యంగా ప్రధాని మోడీ.. ప్రజల నమ్మకాన్ని ఎంత మాత్రం కూడా నిలబెట్టుకోలేకపోయారు. పైగా.. యూపీయేను మించిన అనర్థ రాజకీయ విధానాలతో ప్రజల వెన్ను విరిచారు. ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టారు.

ఒక్క బీజేపీ పాలనలోనే కాదు.. కాంగ్రెస్ పాలనలోనూ ఇదే జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టు.. జాతీయ స్థాయిలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. 70 ఏళ్లుగా దేశం ఇంకా అగాథంలోనే ఉంది. మన పొరుగు దేశం.. చైనా మాత్రం కేవలం 20 నుంచి 25 ఏళ్లలోపల అనూహ్యమైన మార్పు సాధించింది. ప్రపంచంలోనే విదేశీ మారక ద్రవ్యాన్ని అత్యధికంగా కలిగి ఉన్న దేశంగా అవతరించింది.

మరి.. ఉపయోగ భూభాగం అత్యధికంగా ఉన్న మన దేశం.. ఇంకెంత అభివృద్ధి చెందాలి? ఆ దిశగా కాంగ్రెస్, బీజేపీ పాలకులు సమాధానం చెప్పగలరా? లేరు. ఎందుకంటే వారికి దోచుకు తినడం మాత్రమే అలవాటైంది. జనానికి కూడా ఆ తరహా రాజకీయాలు అలవాటు చేయడంలో ఇప్పటివరకూ వారు విజయవంతమవుతూనే వచ్చారు. కానీ.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పోరాడి తెలంగాణ సాధించి పెట్టిన కేసీఆర్.. ఇప్పుడు దేశంలోనూ రాజకీయాల్లో మార్పును కోరుతున్నారు.

తెలంగాణ కోసం ప్రజలు ఎదురుచూసినట్టే.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ ను ఆశాకిరణంగా చూస్తున్నారు. ఓ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టిన నేతగా ఉన్న అనుభవం.. దేశాన్ని మంచి మార్పునకు టర్న్ చేయడంలో పనికి వస్తుందని దేశ ప్రజలు నమ్ముతున్నారు. ఆ దిశగా.. కేసీఆర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తూ.. త్వరగా జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాలని దేశ వ్యాప్తంగా ప్రజలు పిలుపునిస్తున్నారు.

Top