You are here
Home > Latest News > రాజకీయ రంకుకు అలవాటు పడిపోయిన టీడీపీ

రాజకీయ రంకుకు అలవాటు పడిపోయిన టీడీపీ

Spread the love

ఏపీలో కాంగ్రెస్ కు వ్యతిరేకం.. ఇక్కడ మాత్రం మిత్రపక్షం!

అధినేత చంద్రబాబు తీరును ఏపీ నేతలు నిలదీయలేని స్థితి

చేతగాని బాబు చేతిలో కీలుబొమ్మల్లా మారిపోయిన తమ్ముళ్లు

తెలుగు తమ్ముళ్లు చేతగాని దద్దమ్మలుగా మిగిలిపోయేట్టే కనిపిస్తున్నారు. ఎందుకూ కొరగాని రాజకీయాలు చేస్తున్న అధినేత చంద్రబాబు తీరును ఎటూ అర్థం చేసుకోలేకకనీసం నిలదీయనూ లేకవాళ్లు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ ను శత్రువుగా చూస్తున్న పార్టీ నేతలుతెలంగాణలో మాత్రం మిత్రపక్షం చేసుకున్నారు. రాజకీయ వ్యభిచారానికి కొత్త అర్థం చెప్పారు.

సహజంగానే పరిస్థితిపై ప్రత్యర్థుల నుంచి దాడి ఎక్కువవుతోంది. ఏపీలోని టీడీపీ నేతలు చంద్రబాబును నిలదీయాలంటూ టీఆర్ఎస్ పెద్దలు కూడా సవాల్ విసురుతున్నారు. కానీచంద్రబాబును ఎదిరించే మొనగాడు టీడీపీలో ఉన్నారా? ఒకవేళ ఉన్నా…. “ఏం తమాషా చేస్తున్నారాఅని బాబుగారు అనగానేలాగులు తడిపేసుకునే వాళ్లే కదా. అందుకేఏపీ టీడీపీ నేతల తీరును చూసి జనాలు కూడా నవ్వుకుంటున్నారు.

అలాగేతెలంగాణలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మొన్న మొన్నటి వరకూ అంతా తిట్టుకున్న రెండు పార్టీల నేతలుఇప్పుడు కేవలం కేసీఆర్ పరిపాలననే అంతమొందించాలన్న లక్ష్యంతో సరికొత్త రాజకీయ వ్యభిచారానికి తెర తీశారు. పొత్తులతో కేసీఆర్ ను చిత్తు చేద్దామని చూస్తున్నారు. కానీ.. అశేష ఆదరణతోతమ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన కేసీఆర్ ను కాదని కాంగ్రెస్, టీడీపీ కుట్రల కూటమి ఎలా గెలుస్తుందో చూస్తామని జనాలు కూడా సవాల్ విసురుతున్నారు.

సిగ్గూ ఎగ్గూ లేని టీడీపీ నేతలుఇక్కడ తమ ఉనికిని కాపాడుకునేందుకు చేవ చచ్చిన రాజకీయాలు చేస్తున్నారని జనం ఆగ్రహిస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ లను మరింత భూస్థాపితం చేస్తామని పదే పదే స్పష్టం చేస్తున్నారు.

Top