You are here
Home > Latest News > తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి బాగుంది: సద్గురు జగ్గీవాసుదేవ్

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి బాగుంది: సద్గురు జగ్గీవాసుదేవ్

Spread the love

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి బాగుందని సద్గురు జగ్గీవాసుదేవ్ అన్నారు.

హైదరాబాద్‌లో ర్యాలీ ఫర్ రివర్స్ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గీవాసుదేవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చెట్ల పెంపకం, చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం చేస్తున్న కృషి బాగుందన్నారు. ఈ కార్యక్రమాలతో వచ్చే ఐదేళ్లలో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయన్నారు.

నగరం నుంచి రోజుకు వందకోట్ల లీటర్ల వాడిన నీరు బయటికి వెళ్తోందని..

ఉపయోగించిన నీరు వృథా కాకుండా తిరిగి వినియోగంలోకి తేవాలని సూచించారు.

నదుల రక్షణ-భారత సంరక్షణ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అందరూ నదుల రక్షణకు కృషి చేయాలని కోరారు.

Top