You are here
Home > Inter National News > రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు దక్కిన గుర్తింపు ఇది!

రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు దక్కిన గుర్తింపు ఇది!

Spread the love

ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని.. దేశం మొత్తాన్నే ఆకర్షిస్తున్న ప్రాజెక్టు కాళేశ్వరం.. మరోసారి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. నిధుల వినియోగం విషయంలో.. కాళేశ్వరం ప్రాజెక్టును శర వేగంగా పూర్తి చేస్తున్న విషయంలో.. 15వ ఆర్థిక సంఘం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తింది. పనులు జరుగుతున్న తీరు దేశానికి ఆదర్శమని కొనియాడింది. దేశ చరిత్రలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఒక నమూనా అని కీర్తించింది.

ఇన్నాళ్లుగా.. ఇదే ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నుంచి కోదండరాం వరకూ.. కుట్రల మీద కుట్రలు చేశారు. జనాన్ని రెచ్చగొట్టారు. భూములు ఇవ్వకుండా అడ్డు పడ్డారు. కోర్టుల్లో కేసులు కూడా వేశారు. కానీ.. అన్ని అడ్డంకులను అధిగమించి.. ఎక్కువ నష్టం జరగకుండా.. ఎక్కువ లాభం జరిగేలాగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రూపొందించిన ప్లాన్ ప్రకారం.. కాళేశ్వరం ప్రాజెక్టు అనుకున్నది అనుకున్నట్టుగా ముస్తాబవుతోంది.

పనుల విషయంలో ఎక్కడా ఏ మాత్రం తేడా లేకుండా.. గడువులోపే పూర్తయ్యేలా వ్యవహారం నడుస్తోంది. ఈ మహా సంరంభాన్ని కళ్లారా వీక్షించిన ఆర్థిక సంఘం బాధ్యులు.. ఉద్వేగానికి గురయ్యారు. పనులు జరుగుతున్న తీరును వేనోళ్ల కొనియాడారు. ముఖ్యమంత్రి పాలనాతీరుకు.. మంత్రి హరీష్ రావు పనితీరుకు ఫిదా అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు.. మిషన్ భగీరథనూ ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలకు మోడల్ అన్నారు.

దీంతో.. ఇన్నాళ్లూ కాంగ్రెస్ నేతలు చేసిన ప్రచారం అంతా దుష్ప్రచారం అని మరోసారి తేలిపోయింది. ప్రభుత్వం నమ్మకంగా చేస్తున్న కాళేశ్వరం నిర్మాణం.. ప్రజల సంక్షేమాన్ని ఉద్దేశించిందే అని నిరూపితమైంది. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు.. ఈ ప్రాజెక్టు విషయంలో నోరు మూసుకోకుంటే.. ప్రజలుగా తామే ఆ పని చేయాల్సి ఉంటుందన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి.

Top