You are here
Home > Latest News > రెవెన్యూ ప్రక్షాళన తప్పదు.

రెవెన్యూ ప్రక్షాళన తప్పదు.

Spread the love
  • రెవెన్యూ ప్రక్షాళన తప్పదు.
  • ఉద్యోగులు తలకిందులుగా తపస్సు చేసినా ఏం కాదు.
  • మీ అవినీతికి అంతే లేదని ఎన్నో ఆధారాలు ఉన్నాయి.
  • సో.. రెవెన్యూ ఉద్యోగుల తాట తీసేలా కొత్తచట్టం ఉండబోతోంది.
  • లంచం అన్న పదం వినిపిస్తేనే వణికిపోయేలా చట్టం ఉండనుంది.

రెవెన్యూను రక్షించుకుందాం అంటూ ఉద్యోగులు, అవినీతి పరులంతా ఓ చోట చేరి డ్రామాలు ఆడుతున్నారు. ఏం రక్షించుకుంటారు ఉద్యోగుల్లారా??. మీ అవినీతి ఎప్పటికీ ఇలాగే ఉండాలే చేస్తారా?. ప్రజల్ని, రైతుల్ని పీడించుకుతింటారా?. అందుకే కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారా?. అసలు రెవెన్యూ ఉద్యోగులు ఏ తప్పు చేయకుంటే భయపడాల్సిన అవసరం ఏంటి?. ప్రభుత్వం ఏం చేసినా పాజిటివ్ గా తీసుకోవాలి కదా?. అలాకాకుండా భయపడి మీటింగులు పెట్టుకోవడం.. వర్క్ టు రూల్ అంటూ సర్కార్ వ్యతిరేక చర్యలకు దిగడం దేనికి సంకేతం. రెవెన్యూ ఉద్యోగులు సమాధానం చెప్పాలి.

అవినీతి లేకుండా ప్రజలకు పాలన అందించాలని ప్రక్షాళన చేస్తామంటే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు రెవెన్యూ ఉద్యోగుల్లారా?. రెవెన్యూ ఉద్యోగులు ఎంత గొంతు చించుకున్నా.. ఎన్ని ఆందోళనలు నిర్వహించినా.. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే.. ఉద్యోగుల అవినీతితో పాటు.. అడ్డగోలు రిజిస్ట్రేషన్లతో ఖజానాకు కూడా నిధులు రాకుండా చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ భూములను కూడా ఇతర వ్యక్తులకు రిజిస్ట్రేషన్లు చేసిన ఘటనలు ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే ఆన్ లైన్ వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒక్క క్లిక్ రైతుల పని అయిపోయేలా సాఫ్ట్ వేర్ చేయిస్తోందని తెలుస్తోంది.

సర్కార్ తీసుకొచ్చే కొత్త రెవెన్యూ చట్టంతో ఇకపై ప్రజలకు అవినీతి బాధలు తొలగిపోనున్నాయి. అవినీతి జలగలు శాశ్వతంగా సమాజం నుంచి దూరం కానున్నాయి. ఇన్నేళ్లు.. ఉద్యోగులు కోట్లు కూడబెట్టుకున్నారు. ఇక నుంచైనా ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధం కాండి. జీతం తీసుకుంటున్నందుకు నిజాయితీగా పనిచేయండి. అప్పుడు ప్రజల్లోనూ మీకు ఆదరణ పెరుగుతుంది. మంచి పేరు వస్తుంది.

Top