You are here
Home > Latest News > రేవంత్ గెలిస్తే ఆశ్యర్యం కానీ ఓడిపోతే కాదు..

రేవంత్ గెలిస్తే ఆశ్యర్యం కానీ ఓడిపోతే కాదు..

Spread the love
  • రేవంత్ లాంటి తెలంగాణ ద్రోహిని ఓడించక ఇంకేం చేస్తారు ప్రజలు..
  • రేవంత్ చేసిన అక్రమాలకు ఇప్పటికే జైలులో ఊచలు లెక్కపెడుతూ ఉండాలి.. 
  • రేవంత్ ఏమైనా తెలంగాణ జాతి పితా… గెలవడానికి
రేవంత్ రెడ్డిని ఎందుకు నువ్వు ఓడిపోయావని రాహుల్ గాంధీ అడిగాడట. ఏం రాహుల్ గాంధీకి తెలియదా.. రేవంత్ ఎందుకు ఓడిపోయాడో… మరీ అంత అమాయకుడా రాహుల్ గాంధీ. తెలంగాణ లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియకుండా ఉన్నాడా రాహుల్ గాంధీ. అది కూడా ఎన్నికలు అయిన రెండు నెలల తర్వాత.
ఏమయ్యా రాహుల్ గాంధీ ఇప్పుడే నిద్ర లేచావా ఏంది. ఎలక్షన్స్ జరిగి చాలా రోజులు అయింది. ఫలితాలు కూడా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. లే… లేచి మొహం కడుక్కో. నీకు ఎప్పుడు గుర్తుకు వస్తే అప్పుడు మాట్లాడుతావా… రేవంత్ ఎందుకు ఓడిపోయాడో నీకు తెలియదా.. తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు మీ బాగోతాలు చూసి. తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలు దశాబ్దాల పాటు ఎదురు చూశారు ఇకనైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏదైనా చేస్తుందేమోనని…కానీ తెలంగాణ ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణను దోచుకుతిన్నారు. దశాబ్దాలు గా మీ తాతలే తెలంగాణను దోచుకుతిన్నది మిస్టర్ రాహుల్.
ఇప్పుడేమో నువ్వు ఏమీ ఎరగని నంగనాచిలా రేవంత్ నువ్వెందుకు ఓడిపోయావు అని అడుగుతావా. నువ్వు తెలంగాణ కు ఏం చేశావని నిన్ను గెలిపించాలి రాహుల్.. మీరేమీ తెలంగాణ ప్రదాతలు కాదు.. మీరు తెలంగాణను ఆదుకున్న వాళ్ళు కూడా కాదు… తెలంగాణ ప్రజల సంక్షేమం పట్టించుకున్న వాళ్ళూ కాదు… బడుగు బలహీన వర్గాలను ఏనాడైనా పట్టించుకున్నారా. లేదు కదా… మరి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు రాహుల్. ఇప్పుడే కాదు ఇంకో వందేళ్లు అయినా తెలంగాణలో మీకు పుట్టగతులుండవు రాహుల్.
Top