You are here
Home > Latest News > రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి తరిమేసే రోజులు దగ్గరపడ్డాయి…

రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి తరిమేసే రోజులు దగ్గరపడ్డాయి…

Spread the love

 

  • రేవంత్ మూటాముళ్లె సర్దుకొని సిద్ధంగా ఉండు..
  • మళ్లీ ఏ పార్టీలో చేరుతాడో చూడాలిక..
  • నదూకుడు తగ్గించుకోకపోతే నీ గతి అంతే…

ఏమయ్యా రేవంతు.. ఏందయ్యా నువ్వు చేసేది.. ఏం మాట్లాడుతున్నావయ్యా.. ఇది ఏమన్నా తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నావా? కాంగ్రెస్ పార్టీ. నిన్న మొన్న పుట్టిన పార్టీ కాదు.. దశాబ్దాల పాటు అక్కడ భారతదేశాన్ని… ఇక్కడ తెలంగాణను ఏలిన పార్టీ. అందుకే దేశం ఎక్కడ ఉందో తెలుసు కదా. తెలంగాణ ఎలా సంకనాకిపోయిందో తెలుసు కదా కాంగ్రెస్ హయాంలో. ఏంది నీ దూకుడు. అబ్బే.. కాంగ్రెస్ పార్టీ నీళ్లు పడలేదు ఇంకా. లేకపోతే ఏంది. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల నుంచి కొనసాగుతున్న నాయకులు ఎప్పుడైనా ఇలా పదవుల గురించి ప్రచారాల్లో మాట్లాడారా? ఏం మనిషివయ్యా నువ్వు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలను మభ్యపెట్టే పార్టీ. ప్రజలకు మోసం చేస్తున్నట్టు వాళ్లకు తెలియకూడదు. వాళ్లకు తెలియకుండా వాళ్ల ఓట్లను లాక్కోవాలి. వాళ్లకు ఏమాత్రం అనుమానం రాకూడదు. నువ్వేమో.. అప్పుడే నెంబర్ టూ రేస్ గురించి మాట్లాడుతావా? ఏందిది..

టీడీపీ బాబు పార్టీ నుంచి నిన్ను బహిష్కరిస్తే.. దిక్కులేకుండా బిక్కమొహం వేసుకొని చూస్తున్న నిన్ను అక్కున చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ బండారాన్ని బజారున పడేస్తావా? ఏం మాట్లాడుతవో అర్థం కాదు.. ఎలా మాట్లాడుతవో అర్థం కాదు. నువ్వేమన్నా పెద్ద తోపువనుకుంటున్నవా? నీకంత సీన్ లేదు. నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే ఎక్కువ. నువ్వే కాంగ్రెస్ అధ్యక్షుడివనుకుంటున్నావా? నీకే దిక్కు లేదు అంటే నువ్వు ఇలా మాట్లాడుతావా?

ఇప్పటికే నీ బతుకు ఎటూ కాకుండా పోయింది. ఆ ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయ్యావు. రేపో మాపో జైలుకు కూడా పోతవు. అక్రమాస్తుల కేసు కూడా మెడకు చుట్టుకుంది. టీడీపీలో ఉన్నప్పుడు కోట్లు కూడబెట్టినవు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరినవు. ఇక్కడ ఎంత కూడబెడతవు. ఈ లత్కోరు కాంగ్రెస్ నాయకులతో కలిసినవు కానీ.. వాళ్ల ప్లాన్లను నువ్వు అర్థం చేసుకుంటలేవు. నీ దూకుడు తగ్గించకపోతే నిన్ను పార్టీ నుంచి తొందరలోనే గెంటేస్తారు. అప్పుడు నీ బతుకు బందరు బస్టాండే. మూటాముళ్లె సర్దుకొని ఏడికి పోతవు.

Top