You are here
Home > Latest News > రేవంత్ రెడ్డి.. పిల్ వేయగానే సరిపోదు.. ఆధారాలు ఉండాలి..

రేవంత్ రెడ్డి.. పిల్ వేయగానే సరిపోదు.. ఆధారాలు ఉండాలి..

Spread the love

 

  • తెలంగాణలో ఇండస్ట్రీలు రావడం రేవంత్ కు ఇష్టం లేదు..
  • అటు ప్రాజెక్టుల మీద కేసులు వేస్తారు.. ఇటు ఇండస్ట్రీల మీద కూడా వేస్తున్నారు..
  • తెలంగాణ ద్రోహులను తరిమేస్తేనే తెలంగాణ ప్రశాంతంగా ఉంటుంది..

తెలంగాణలో ఇండస్ట్రీలు వచ్చి నిరుద్యోగం తగ్గి తెలంగాణ బాగుపడితే వీళ్లు ఓర్వరు. అందుకే తెలంగాణ రైతన్నను ఆదుకోవడం కోసం త్వరితగతిన సాగునీటి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తుంటే కాంగ్రెస్ నేతలు వందల కేసులు వేసి వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకాస్త ముందడుగు వేసి వేలాది మందికి ఉపాధి కల్పించబోయే ఐకియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై కేసు వేశాడు. అంటే వీళ్లకు కావాల్సింది ఒకటే. తెలంగాణ అభివృద్ధి చెందకూడదు. దానికోసం ఏదైనా చేస్తారు. అన్నింటినీ అడ్డుకుంటారు. మోకాలడ్డేస్తారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కూడా కాంగ్రెస్ నేతలు వేసిన వందలాది కేసులు ఉన్నాయి. మరి.. ఇటువంటి వాళ్లను ఏం చేయాలో తెలంగాణ ప్రజలే డిసైడ్ చేసుకోవాలి.

ఏదో బట్ట కాల్చి మీదేస్తే సరిపోదు కదా రేవంత్ రెడ్డి. ఏదైనా మాట్లాడితే దానికి ఓ లెక్కుండాలి. ఆధారాలు ఉండాలి. ఏదో ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం.. మీడియాలో హల్ చల్ చేయడం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. నీకు అటువంటివి అలవాటే కదా. తొడకొట్టుడు.. పీకుతా.. రక్కుతా అంటూ మీడియాలో హల్ చల్ చేయడం నీకు వెన్నతో పెట్టిన విద్య. అదే విద్యను ఇప్పుడు ప్రదర్శిస్తున్నావు రేవంత్.

అక్కడి ప్రాంతాన్ని ఐటీ కంపెనీలకే కేటాయించాలనే నీ అసంబద్ధ వాదనేందో అర్థం కావట్లేదు. ఆయా కంపెనీలకు సంబంధించిన పనిని బట్టి, సాధ్యాసాధ్యాలను బట్టి భూమి కేటాయిస్తారు. కాని.. ఖచ్చితంగా ఈ కంపెనీకి అక్కడ భూమి కేటాయించకూడదు అనే రూల్ ఏమన్నా ఉందా రేవంత్. కావాలని.. నువ్వు ఏదో ఒకటి లూప్ హోల్ పట్టుకొని ప్రభుత్వాన్ని బదనాం చేద్దాం అన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నావని తెలంగాణలోని ప్రతి ఒక్కరికి అర్థమవుతూనే ఉన్నది రేవంత్. ఇంకా నువ్వు సిగ్గూ శరం లేకుండా తెలంగాణ ప్రజలు ఛీ కొడుతున్నా అదే తెలంగాణలో ఉంటూ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతున్నావు.

Top