You are here
Home > Latest News > రేవంత్ రెడ్డీ.. మళ్లీ ఊచలు లెక్కపెట్టేందుకు రెడీ కా!

రేవంత్ రెడ్డీ.. మళ్లీ ఊచలు లెక్కపెట్టేందుకు రెడీ కా!

Spread the love

ఆధారాలంటే ఏంటో తెలుసా రేవంత్ రెడ్డీ నీకూ? చేతిలో ఐదు కోట్లు పట్టుకుని.. ఓ ఎమ్మెల్యేను కొనుగోలు చేయబోతూ.. నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. మీడియా సాక్షిగా అవినీతి చేసిన విధానం ఉంది గుర్తుందా.. అదిగో అది ఆధారమంటే. చేసిన పనికి సజీవ సాక్ష్యమంటే అదిగో.. అదీ. అంతే కానీ.. ఇలా అర్థం పర్థం లేని విమర్శలు చేస్తూ.. అవినీతి అవినీతి అని పాట పాడుతూ.. కేసీఆర్ పాలనపై విమర్శలు చేస్తే.. అన్నీ నిజమైపోతాయని అనుకోవద్దు.

నీది అజ్ఞానమో.. అతి మూర్ఖత్వమో కానీ.. కాంగ్రెస్ నేతలే బాధపడే స్థాయికి ఆ పార్టీని దిగజార్చేస్తున్నావు. చర్చకు ఉత్తమ్, జానా, షబ్బీర్, జీవన్ లను రమ్మంటే.. వాళ్లను కాదని నువ్వు వస్తానంటున్నావు. ఎందుకంత ఆరాటం? ఏదో మాట్లాడినట్టుగా కలరింగ్ ఇచ్చి పార్టీలో పదవులు పొందాలనా? ముఖ్యమంత్రి అవ్వాలనా? నీ కోరిక అంత సులువుగా తీరదు రేవంత్ రెడ్డీ. నాడు కాంగ్రెస్ పాలకులే ప్రాజెక్టులు మొదలు పెడితే ఎందుకు పూర్తి చేయలేకపోయారన్నదీ చెప్పవు. సోనియాను కలిసి కృతజ్ఞత చెప్పిన కేసీఆర్ గొప్పతనాన్ని వక్రీకరిస్తావు.

ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ కు ఆర్డర్లు ఇస్తే.. తప్పుబడతావు. అధికారులను జైలుకు పంపుతా అని.. ముఖ్యమంత్రిని జైలుకు పంపుతా అని బెదిరిస్తావు. నువ్వేమన్న కాబోయే ముఖ్యమంత్రినని కలలు కంటున్నవా.. లేకపోతే ఇప్పుడే ప్రభుత్వం నీ చేతుల్లోకి వచ్చేసిందని భ్రమ పడుతున్నవా? అని జనాలు అడుగుతున్నారు. చేతనైతే.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు రేవంత్ రెడ్డీ.

సీమాంధ్ర కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడమన్నది.. ఎక్కడ విద్యుత్ ఉంటే అక్కడ కొనుగోలు చేసే విధానంలో ఓ భాగం. అలా కొనుగోలు చేయడంతోనే.. విద్యుత్ రంగంలో ఇప్పుడు తెలంగాణ సర్కారు ఆదర్శంగా నిలుస్తోంది. అది కూడా తప్పు అంటే.. నీ అతి తెలివిని ఎలా పొగడాలో అర్థం కావడం లేదు. పాపాల చిట్టా ఉంది అని చెబుతున్న నువ్వు.. ఎందుకు బయటపెట్టలేకపోతున్నావు? ఇలా మాటలతోనే సరిపెడతావా? ఇంతేనే నీ పొలిటికల్ కెపాసిటీ? గుర్తుంచుకో. ఇలాంటి నిరాధార ఆరోపణలే.. రేపు నీకు ఘోరీ కట్టబోతున్నాయి. జాగ్రత్త.

Top