You are here
Home > Latest News > రైతన్నను అన్ని విధాలా ఆదుకుంటున్నదే టీఆర్ఎస్ ప్రభుత్వం కిషన్ రెడ్డి..

రైతన్నను అన్ని విధాలా ఆదుకుంటున్నదే టీఆర్ఎస్ ప్రభుత్వం కిషన్ రెడ్డి..

Spread the love

 

  • పంటలను ఎండబెడుతున్నది కేంద్రంలో అధికారంలో ఉన్న మీ ప్రభుత్వమే..
  • గత ప్రభుత్వాలు తెలంగాణ రైతన్నను నట్టేట ముంచాయి..
  • సీఎం కేసీఆర్ దూరదృష్టితో దేశంలోనే ఏ రాష్ట్రం ప్రవేశపెట్టని పథకాలను ప్రవేశపెట్టారు..

ప్రభుత్వం పంటలను ఎండబెడుతున్నదట. బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి అంటున్న మాటలు ఇవి. ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకో కిషన్ రెడ్డి. తెలంగాణ రైతన్న సాగు నీరు కోసం ఎలా విలవిలలాడిపోయాడో. సరైన ఎరువులు దొరకక, నాణ్యమైన విత్తనాలు లేక.. కరెంట్ లేక అల్లాడిపోయాడు. ఏ ప్రభుత్వమైనా పట్టించుకున్నదా? లేదు. పోనీ.. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ దేశంలోని రైతన్నను ఆదుకుంటున్నదా కిషన్ రెడ్డి. చెప్పు. కేంద్రంలో అధికారంలో ఉన్నది మీ పార్టీయే కదా.

తెలంగాణలో రైతులు కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోనే మొట్టమొదటి పథకాలు. ఇంతవరకు ఏ ప్రభుత్వమూ ఆలోచించలేదు. మోదీ కూడా రైతన్న కోసం ఇటువంటి పథకాలకు రూపకల్పన చేయలేదు. కాని.. రైతుల సంక్షేమం కోసం, తెలంగాణ రైతన్న కష్టాలు పడకూడదని దూరదృష్టితో ఆలోచించి సీఎం కేసీఆర్ అద్భుతమైన పథకాలను రూపకల్పన చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీయే ఆ పథకాలను చూసి పొగిడింది కిషన్ రెడ్డి. సాగు నీటి ప్రాజెక్టులు,  రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను చూసి ఔరా అన్నది కేంద్రం. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ పథకాలను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.

కాని.. తెలంగాణ వ్యక్తివై ఉండి.. తెలంగాణలో పుట్టి తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక ఇటువంటి కూతలు కూస్తున్నావు కిషన్ రెడ్డి. దశాబ్దాలుగా గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని నాలుగేండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారు. ఒప్పుకుంటాం. రాష్ట్రంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవమే. ఒక్కరోజులో అంతా సక్రమంగా జరగాలంటే జరుగుతుందా? దేనికైనా సమయం కావాలి. ఒక్కో వర్గాన్ని బాగు చేస్తూ బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ అడుగులు వేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. నువ్వన్న ఎస్సారెస్పీ పథకం పునర్జీవం కోసం రెండు వేల కోట్లు కేటాయించారు సీఎం కేసీఆర్. 60 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అద్భుత ప్రాజెక్టు ఇది. మరి.. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారో నీకు తెలియదా? తెలంగాణ రైతన్న మరో 50 ఏండ్ల వరకు సాగు నీటి కోసం బాధపడకూదని.. ఎస్సారెస్పీని పునర్జీవం చేస్తున్నారు. వర్షాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయినిగా ఎస్సారెస్పీ పునర్జీవ పథకం నిలవబోతున్నది.

Top